SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kohli Record: ఎల్లుండి తొలి వన్డేలో విండీస్‌పై కోహ్లీ విధ్వంసం చేస్తాడా?

Virat Kohli Likely To Play Record Innings Against West Indies On September 27th: స్వదేశంలో వెంస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మరోసారి విరాట్‌ కోహ్లీ రఫ్పాడించేందుకు సిద్ధమవుతున్నాడు. ఎల్లుండి జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శనపైనే అందరి కళ్లు పడ్డాయి. ఏ రేంజులో ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 25, 2026, 08:53 PM IST | Updated: Sep 25, 2026, 08:57 PM IST
Image Credit: Source: BCCI Twitter
Join

Virat Kohli Records: స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ఎల్లుండి ప్రారంభం కానుండగా.. అందరి కళ్లు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీపైనే ఉంది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం తిరువనంతపురంలో విండీస్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే ఇరు జ‌ట్ల ఆటగాళ్లు తిరువనంతపురానికి చేరుకున్నారు. శుక్రవారం మైదానంలో కూడా ప్రాక్టీస్ చేశాయి. దశాబ్దాలుగా వెస్టిండీస్‌పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత జట్టు ఈ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటామని పూర్తి విశ్వాసంతో ఉంది. అయితే మైదానంలో విరాట్‌ కోహ్లీ ఏ స్థాయిలో ఆడతాడనేది ఆసక్తికరంగా ారింది.

విండీస్‌తో సిరీస్ అన‌గానే పరుగుల వీరుడు విరాట్ కోహ్లి చెల‌రేగి ఆడుతుంటాడు. గతంలో విండీస్‌పై కోహ్లీ నమోదు చేసిన గ‌ణాంకాలు అదే చెబుతున్నాయి. 2018లో వెస్టిండీస్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు రాగా.. ఆ సిరీస్‌కు భారత కెప్టెన్‌గా కోహ్లి వ్య‌వ‌హ‌రించాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ ఆ సిరీస్‌లో కోహ్లీ సత్తా చాటాడు. ఆ సిరీస్‌ను 3-1తో (ఒక మ్యాచ్ టై) భారత జట్టు సొంతం చేసుకుంది. ఆ సిరీస్‌లో విండీస్‌పై కోహ్లి విధ్వంసం సృష్టించాడు.

వెస్టిండీస్‌ ఆడిన ఐదు వ‌న్డేల్లో కోహ్లి 453 ప‌రుగులు నమోదు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. వాటిలో మూడు సెంచ‌రీలు ఉండ‌డం విశేషం. అది వ‌రుసగా మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ అలవోకగా చేయడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు. ఆ సిరీస్‌లో జరిగిన తొలి వ‌న్డేలో కోహ్లి 107 బంతుల్లో 140 నాటౌట్‌గా నిలవగా.. రెండో వ‌న్డేలో దానికి మించి ఆడి 129 బంతుల్లో 157 ప‌రుగులు సాధించాడు. విండీస్‌తో జరిగిన మూడో వ‌న్డేలో 119 బంతుల్లో 107 ప‌రుగులు చేసి వరుసగా మూడో సెంచరీ నమోదు చేశాడు. వీటితో మూడు వ‌రుస వ‌న్డేల్లో శ‌త‌కాలు సాధించిన తొలి బ్యాట‌ర్‌గానూ కోహ్లి రికార్డు సాధించాడు.

వెస్టిండీస్‌పై మ్యాచ్‌ అంటే కోహ్లీకి పూనకాలు వచ్చినట్టు అవుతుంది. అంతలా చెలరేగి ఆడి పరుగులు సునాయాసంగా రాబడుతాడు. మరి ఎల్లుండి జరగనున్న తిరువనంతపురం మ్యాచ్‌లో కోహ్లీ ఎలా ఆడుతాడనేది అతడి అభిమానులతోపాటు క్రికెట్‌ ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విండీస్‌పై విధ్వంసం చేయాలని భావించి కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నాు. తనకు జోడీగా రోహిత్ శర్మ కూడా బరిలో దిగుతుండడంతో వీరిద్దరూ కలిసి మళ్లీ పరుగులతో వినోదం అందిస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES