SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Eatala Rajender: ప్రధానమంత్రి పదవిపై రాహుల్‌ గాంధీ పగటికలలు కనొద్దు: ఈటల రాజేందర్‌

MP Eatala Rajender Suggest To Dont Dream On Day Time About Prime Minister: హైదరాబాద్‌కు వచ్చి మోదీని, దేశ ప్రతిష్టను భంగపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని రాహుల్‌ గాంధీకి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి సోయి లేకపోవడంతోనే హైదరాబాద్‌కి తాగునీటి కష్టాలు వచ్చాయని విమర్శించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 16, 2026, 23:29 IST | Updated: Nov 17, 2026, 13:20 IST
Image Credit: Eatala Rajender
Join

Hyderabad: 'ప్రధాని మోదీని విమర్శిస్తే సహించేది లేదు. రాహుల్ గాంధీ ఖబర్దార్' అని ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. భారత వ్యతిరేకులను తీసుకువచ్చి దేశ ప్రతిష్టను దిగజార్చేలా చేయడం సిగ్గుచేటు అని  ప్రకటించారు. రాహుల్ గాంధీకి పార్లమెంటులో మాట్లాడడం చేత కాదు.. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ లాగా భారత్ లో కూడా అల్లర్లు జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి పగటి కలలు కనవద్దు అని సూచించారు.

'సోనియా గాంధీ పుస్తకంలో అవాస్తవాలు రాసి దేశప్రజలను పక్కదోవ పట్టించారు. రేవంత్ రెడ్డికి సోయి లేకపోవడంతోనే హైదరాబాద్‌కి తాగునీటి కష్టాలు వచ్చాయి. సోనియా, రాహుల్ గాంధీకి డబ్బులు పంపే దానిపై ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలమీద లేదు. నీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు' అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

'రాష్ట్రంలో ఏ సమస్యొచ్చినా దానిని ఇతరుల మీద నెట్టి.. ఎదురుదాడితో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. ముఖ్యమంత్రిగా తనకు బాధ్యత ఉందనే సోయి రేవంత్ రెడ్డికి లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వపు తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఎల్‌నినో ముప్పుపై హెచ్చరించినా ప్రభుత్వానికి పట్టలేదు.

'రాబోయే కాలంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారని ఏడాది ముందే శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ వ్యవస్థలు హెచ్చరించాయి. దీనిపై నేనే స్వయంగా తొలి ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాను. 'రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ మీ కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదు. భూమి మీద ఉండి ఆలోచించండి' అని హితవు పలికారు. రాబోయే తాగు, సాగునీటి , భూగర్భ జలాలు అడుగంటిపోవడం, కరెంటు సమస్యలపై ముందుగానే ఆలోచించాలని కోరారు. 'కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండొచ్చు. కానీ ఆ కోపంతో తెలంగాణ రైతులను శిక్షించవద్దు' అని విజ్ఞప్తి చేశారు.

'హైదరాబాద్ నగరంలో.. రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు లేక, బోర్లు-బావులు ఎండుకుపోయి హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు' అని ఎంపీ ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయినప్పటికీ.. చేతికి వచ్చిన కాస్త ధాన్యాన్ని అమ్ముకోవడానికి వెళ్తే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని మండిపడ్డారు. 'కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా గన్నీ బస్తాలు లేవు, అమాలీ వ్యవస్థ లేదు, కాంటాలు లేవు, తార్పాలిన్లు లేవు. కనీస ధర్మంగా అఖిలపక్ష సమావేశం పెట్టి రైతుల సమస్యలపై చర్చించాల్సిన సంస్కారం కూడా రేవంత్‌ రెడ్డికి లేదు. 'నాకు తెలవదా.. అన్నీ నేనే చేస్తా' అనే అహంకార ధోరణితో వ్యవహరిస్తూ రైతులను రోడ్డున పడేశారు' అని ధ్వజమెత్తారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES