CM Revanth reddy govt increases foreign liquor prices: దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఎక్కడ చూసిన దసరా పండగ సంబరాల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు సెలవులను ప్రకటించడంతో ప్రజలు తమ సొంతూర్లకు వెళ్లిపోయారు. తెలంగాణలో దసరా పండగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ చుక్క, ముక్క తప్పనిసరిగా పండక్కి ఉండాల్సిందే. తమ స్నేహితులు, బంధువులతో కలిసి దావత్ లు చేసుకుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని ఝలక్ ఇచ్చింది.
తెలంగాణలో విదేశీ మద్యం ధరలు భారీగా పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు..ఈ నెల 12వ తేదీ నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు అధికారిక సర్క్యులర్‌లో పేర్కొంది.
రాష్ట్రంలో ప్రస్తుతం విక్రయిస్తున్న 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం సమీక్షించింది. ఫుల్ బాటిల్‌పై కనిష్ఠంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు ఉన్నట్లు సమాచారం. సగటున 6 శాతం వరకు ధరలు పెరగడంతో విదేశీ మద్యం కొనుగోలుదారులకు మాత్రం ఇది బిగ్ షాక్ ఇచ్చేదిగా మారింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం
కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు ఆబ్కారీ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ లను విడుదల చేసింది. దీనికి మొత్తం 8,771 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష నిర్ణయించడంతో ప్రభుత్వ ఖజానాకు ఈ రూపంలోనే రూ.87.71 కోట్ల ఆదాయం వచ్చి చేరింది.
ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. దీనిపై ఈ నెల 16న లాటరీ ద్వారా బార్ల నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు. మరోవైపు పండగ వేళ విదేశీ మద్యంపై ధరలు పెరగడంపై మందుబాబులు తమ అసహానం వ్యక్తం చేస్తున్నారు.