SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Revanth reddy: దసరా పండగ వేళ మందుబాబులకు ఝలక్.. ఆ బ్రాండ్ ధరలు భారీగా పెంచిన సీఎం రేవంత్ ప్రభుత్వం.!.

Foreign liquor Prices hike: తెలంగాణలో ప్రస్తుతం ఉన్న బ్రాండ్‌ను బట్టి విదేశీ మద్యం.. ఫుల్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెంచుతూ సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సగటున 6 శాతం వరకు ధరల పెంపు ఉండనుంది.

Written By Inamdar Paresh
Published: Oct 14, 2026, 03:21 PM IST | Updated: Oct 14, 2026, 05:02 PM IST
Image Credit: cmrevanthreddy(file)
Join

CM Revanth reddy govt increases foreign liquor prices: దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఎక్కడ చూసిన దసరా పండగ సంబరాల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు సెలవులను ప్రకటించడంతో ప్రజలు తమ సొంతూర్లకు వెళ్లిపోయారు.  తెలంగాణలో దసరా పండగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ చుక్క, ముక్క తప్పనిసరిగా పండక్కి ఉండాల్సిందే. తమ స్నేహితులు, బంధువులతో కలిసి దావత్ లు చేసుకుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని ఝలక్ ఇచ్చింది.


తెలంగాణలో విదేశీ మద్యం ధరలు భారీగా పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బ్రాండ్‌ను బట్టి ఫుల్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు..ఈ నెల 12వ తేదీ నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.

 ప్రస్తుతం విక్రయిస్తున్న 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో.. బాటిల్‌పై కనిష్ఠంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు ఉన్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం.. సగటున 6 శాతం వరకు ధరలు పెరగడంతో విదేశీ మద్యం ప్రియులకు ఇది బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు. 

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 16న లాటరీ ద్వారా బార్ల నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు. మరోవైపు పండగ వేళ విదేశీ మద్యంపై ధరలు పెరగడంపై మందుబాబులు తమ అసహానం వ్యక్తం చేస్తున్నారు.  

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES