SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణకు తుఫాన్ ఎఫెక్ట్.. నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు అలర్ట్!

Cyclone Aqwan Effect: అక్వాన్ తుఫాను కారణంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా 20వ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని చాలా జిల్లాలను వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయట. కాబట్టి ఈ సమయాల్లో రైతులతో పాటు ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 15, 2026, 10:50 AM IST | Updated: Nov 15, 2026, 10:53 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Cyclone Aqwan Effect: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్ తుఫాను ప్రభావం రాష్ట్ర వాతావరణంపై ఘననీయంగా ఉంటుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ తుఫాన్ కారణంగా ఈనెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఈ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వెదర్ మ్యాన్ అందించిన సమాచారం ప్రకారం.. ఈనెల 20, 21, 22 తేదీల్లో ప్రధానంగా ఆరు జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందట.. ఖమ్మం తో పాటు భద్రాది కొత్తగూడెం, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు.. ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

మొదట ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిన తర్వాత.. ఈనెల 21తో పాటు 22 తేదీల్లో తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. ఆయా జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే ఆస్కారం ఉందని ఆయన అన్నారు.. మరోవైపు అక్వాన్ తుఫాన్ కదలికలను వాతావరణ శాఖ క్లుప్తంగా పరిశీలిస్తోంది. తాజా అంచనాల ప్రకారం.. ఈ తుఫాన్ ఈనెల 20వ తేదీన ఉత్తర కోస్తా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో పాటు దాని పరోక్ష ప్రభావం పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయట..

ప్రస్తుతం పంట కోతతో పాటు ధాన్య కొనుగోళ్ల సమయం కావడంతో అన్నదాతలు వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే కల్లాల్లో ఉన్న పంట సురక్షితమైన ప్రాంతాలకు తరలించుకోవడం లేదా టార్పాలిన్ పట్టాలతో కప్పి ఉంచడం మంచిదని వారి పేర్కొన్నారు. అలాగే భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. కావాలంటే వాటిని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తూ వస్తున్నారు.. అంతేకాకుండా ఈ సమయాల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES