Love Ends Life: మేనబావను ప్రేమించిన కుమార్తెను పరువు కోసం కాటికి పంపిన తండ్రి
Father Ends Her Daughter Life After Love: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే సొంత బిడ్డను చంపేసుకున్నాడు. తన బిడ్డ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ఆయన తన పరువు కోసం కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడు. మేనబావతో ప్రేమలో ఉందనే విషయం తెలుసుకుని తన కుమార్తెకు ఉరేసిన తండ్రి కాలయముడయ్యాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Love With Brother In Law: కన్నతండ్రి కర్కోటకుడిగా మారాడు. ఎత్తుకున్న ఆ చేతులతోనే గొంతు నులిపి చంపాడు. తండ్రి బలం ముందు ఆ కుమార్తె బలం సరిపోలేదు. నాన్న.. నాన్న.. అని పిలిచిన ఆ గొంతును సొంత తండ్రే నులిపివేశాడు. ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆగకుండా చేసి ప్రాణాలు పోయేలా చేశాడు. తండ్రిని చూస్తూనే ఆ బిడ్డ కన్నుమూసింది. పుట్టిన మొదటిసారి తండ్రిని చూసిన ఆ కళ్లు.. చావులోనూ చివరిసారి తండ్రినే చూశాయి. మంచి తండ్రి కావాల్సిన అతను బిడ్డను చంపి కసాయి తండ్రి అయ్యాడు. కూతురిని చంపిన తండ్రి ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామం. ఉమ్రి గ్రామంలో ఆదే కైలాస్ కుమార్తె కల్యాణి. పద్దెనిమిది సంవత్సరాలు నిండడంతో కల్యాణికి వివాహం చేయాలని తల్లిదండ్రులు చూస్తుండగా.. ఒక సంబంధం ఖాయం చేశారు. ఈ నెల 25వ తేదీన ఆ అబ్బాయితో కల్యాణి నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. అయితే 23వ తేదీన కుమార్తె దిగులుగా ఉండడాన్ని తల్లిదండ్రులు గమనించి 'ఏమైంది బిడ్డా? ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు? ఎల్లుండి నిశ్చితార్థం ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే ఎలా బిడ్డా?' అని తండ్రి కూతురిని ప్రేమగా అడిగాడు. అయితే తాను 'బావని ప్రేమిస్తున్నా' అని మేనత్త కొడుకుని ప్రేమిస్తున్న విషయం తండ్రికి తెలిపింది. అయితే మేనబావతో పెళ్లికి అంగీకరించలేదు.
కుమార్తె ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి తండ్రి కైలాశ్ తట్టుకోలేకపోయాడు. తన మేనల్లుడితో వివాహం చేసేందుకు అంగీకరించని ఆయన కుమార్తె కల్యాణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెల్లారితే నిశ్చితార్థం ఉండగా.. కుమార్తె ఇలా ట్విస్ట్ ఇవ్వడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. 24వ తేదీ మంగళవారం వేకువజామున కుమార్తె గొంతు నులిమి హత్య చేశాడు. కూతురు పడుకున్న గదిలోకి వెళ్లి ఆమె గొంతు నులిపి చంపేశాడు.
ప్రాణం పోయిన కుమార్తె తలకు ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి కైలాశ్ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఉదయం లేచే సరికి కల్యాణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబసభ్యులతో నమ్మించారు. ఏమీ తెలియనట్టు భార్య, ఇతర కుటుంబసభ్యులతో కలిసి కైలాశ్ బోరున ఏడ్చాడు. పెళ్లి ఇష్టం లేక కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయాలని కైలాశ్ తొందరపెట్టాడు. ఉదయం తొమ్మిది గంటల లోపే కూతురి మృతదేహాన్ని ఖననం చేశాడు.
అయితే ఇక్కడే కైలాశ్ దొరికిపోయాడు. తెల్లవారుజామున ఉరివేసుకున్న కుమార్తె అంత్యక్రియలు వెంటనే అంత్యక్రియలు పూర్తి చేయడంతో బంధుమిత్రులకు, గ్రామస్తులకు అనుమానాలు వచ్చాయి. కుల ఆచారం ప్రకారం ఖననం చేయకుండా దహన సంస్కారాలు చేయడంతో కులస్తులకు కూడా తీవ్ర అనుమానం వ్యక్తమైంది. బంధువులకు, దగ్గరి వారికి కూడా ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలు పూర్తి చేయడంతో పలువురు పోలీసులకు సమాచారం అందించారు.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నార్నూర్ సీఐ గురుస్వామి అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. వెంటనే గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణ సమయంలో తండ్రి కైలాశ్ చేసిన దారుణాన్ని చెప్పాడు. తానే కుమార్తె కల్యాణిని చంపినట్టు తండ్రి పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. తదుపరి పోలీసుల విచారణలో మరో కారణం వివరించాడు. 'వేరే అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత నా బిడ్డ మేనబానుని ప్రేమిస్తుంది అని చెప్పింది. ఇప్పటికే మాట్లాడిన పెళ్లి సంబంధం రద్దు చేసుకుంటే నా పరువు పోతుందనే కారణంతో కుమార్తెను హత్య చేశా' అని కైలాశ్ పోలీసుల విచారణలో తెలిపాడు.