SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Saddula Bathukamma: వైభవంగా సద్దుల బతుకమ్మ.. పూలసంద్రంగా మారిన ట్యాంక్‌బండ్‌

Grandly Celebrates Saddula Bathukamma At Tank Bund: తెలంగాణ సంస్కృతి వైభవాన్ని సద్దుల బతుకమ్మ వేడుకలు చాటిచెప్పాయి. హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పలువురు ప్రముఖులు సందడి చేశారు. తెలంగాణ కోడలు రష్మిక మందన్నా తొలిసారి బతుకమ్మ ఆడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 18, 2026, 10:44 PM IST | Updated: Oct 18, 2026, 10:47 PM IST
Image Credit: Bathukamma Celebrations At Tank Bund
Join

Saddula Bathukamma Celebrations: పూలను పూజించే విశిష్ట సంస్కృతి.. సంప్రదాయం కలిగిన తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పూలవనంగా మారాయి. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటేలా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పలువురు ప్రముఖులు సందడి చేసి ఆడిపాడారు. తెలంగాణ కోడలు రష్మిక మందన్నా తొలిసారి బతుకమ్మ ఆడి మైమరిచిపోయారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ సద్దుల బతుకమ్మ వేడుకలు ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 1,000 మంది మహిళలు అందంగా అలంకరించిన బతుకమ్మలను చేతబట్టి భారీ ఊరేగింపుగా వేడుకలకు రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మహిళలతోపాటు సందర్శకులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడింది.

సద్దుల బతుకమ్మ వేడుకలకు తెలంగాణ గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, జర్మనీ గౌరవ కాన్సుల్ జనరల్ అమితా దేశాయ్, బ్యూరో డి ఫ్రాన్స్ డిప్యూటీ హెడ్ రోహిణి, బ్యూరో డి ఫ్రాన్స్ హెడ్  పియర్ బియోడిన్, డిప్యూటీ బ్రిటిష్ హైకమిషన్ పొలిటికల్, ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురామన్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, సృజనాత్మక రంగాలను ప్రతిబింబించేలా రూపొందించేలా ఏర్పాటుచేసిన శకటాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా సాయంత్రం నిర్వహించిన లేజర్ షో, అద్భుతమైన బాణసంచా ప్రదర్శన వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చాయి. బాణాసంచా వెలుగులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మెరిసిపోగా.. రంగురంగుల బతుకమ్మలు, మహిళల భారీ ఊరేగింపు, ప్రజల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో ఆ ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది. ప్రజలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన బతుకమ్మ థీమ్ సెల్ఫీ పాయింట్లు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణ కోడలిగా వచ్చిన సినీ నటి రష్మిక మందన్నా తొలిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన సినీ నటుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న అనంతరం రష్మిక మందన్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. వారిద్దరూ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడం మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ మహిళల సంప్రదాయ ఉత్సాహాన్ని, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, పర్యాటక ప్రత్యేకతలను ఒకే వేదికపై ఆవిష్కరించాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES