• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

Gun Shots Fired On Tiger Shroff: బాలీవుడ్‌లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. సినీ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ముంబైలో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే త్రుటిలో ప్రమాదం నుంచి నటుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 18, 2026, 11:25 PM IST|Updated: Oct 18, 2026, 11:43 PM IST
joinshare
Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు
Image Credit: Tiger Shroff Gun Firing

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

2

Saddula Bathukamma: వైభవంగా సద్దుల బతుకమ్మ.. పూలసంద్రంగా మారిన ట్యాంక్‌బండ్‌

3

రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

4

వరి దిగుబడులు బాగున్నా.. బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

5

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: రోజువారీ వంటకు ఏది సురక్షితమో తెలిస్తే వెంటనే మార్చేస్తారు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lawrence Bishnoi Gang: అత్యంత సంపన్నులు.. సినీ, వ్యాపార ప్రముఖులు నివసించే ముంబైలో ఒక్కసారిగా సంచలన సంఘటన చోటుచేసుకుంది. సినీ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై పట్టపగలు కొందరు దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. టైగర్‌ ష్రాఫ్‌ లక్ష్యంగా కాల్పులు జరపడం తీవ్ర సంచలనం రేపింది. అయితే కాల్పుల నుంచి టైగర్‌ ష్రాఫ్‌ సురక్షితంగా బయటపడగా కొందరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర అలజడి రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాఘీ, బాఘీ 2, వార్ సినిమాలతో సినీ ప్రేక్షకుల గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ముంబైలోని ఆదివారం జూహూ ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. ఆదివారం సాయంత్రం బీఎండబ్ల్యూ ఆరులో ఉండగా టైగర్ ష్రాఫ్‌ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. అయితే ప్రమాదం నుంచి టైగర్‌ ష్రాఫ్‌ సురక్షితంగా బయటపడగా అతడి కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనలోనే మరో వ్యక్తి గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలించారు.

Gunshots fired near #TigerShroff's car… Glad he's safe https://t.co/Zj4vXAWuN8

— Abhi (@abhim3010) October 18, 2026

 టైగర్‌ ష్రాప్‌పై కాల్పులకు తెగబడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఈ ముఠా పలువురిపై దాడి చేసిన విషయం తెలిసిందే. వారిలో స్టార్‌ నటుడు సల్మాన్ ఖాన్‌పై కూడా ఆ గ్యాంగ్‌ కాల్పులకు తెగబడింది. జుహు పరిధిలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో టైగర్ ష్రాఫ్ క్షేమంగా ఉన్నారని డీసీపీ మోహిత్ గార్గ్ స్పష్టం చేశారు.

ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు లేదా వారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ధ్రువీకరించలేదు. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులని గుర్తించేందుకు, దాడి వెనుక ఉన్న అసలు కారణాలను తేల్చేందుకు ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. విచారణకు ఆదేశించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Crime News
Telugu News
Trending News