SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Guru Vandanam Awards: "ఉపాధ్యాయులే దేశ భవిష్యత్తు నిర్మాతలు"..'గురువందనం-2026'లో జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత ప్రసంగం!

Guru Vandanam Awards Editor Bharath Speech: ప్రముఖ వార్తా స్రవంతి జీ తెలుగు న్యూస్ నిర్వహించిన 'గురు వందనం-2026 ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అండ్ టీచర్ అవార్డ్స్' కార్యక్రమంలో జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్ ముఖ్య ప్రసంగం చేశారు. సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, కలెక్టర్లు, జర్నలిస్టులు, క్రీడాకారుల వంటి ఏ వృత్తి వారినైనా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఆయన కొనియాడారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ తగిన గౌరవం అందించాలని పిలుపునిచ్చారు.

Written By Harish Darla
Published: Oct 13, 2026, 06:18 PM IST | Updated: Oct 13, 2026, 06:23 PM IST
Image Credit: Source: Zee Telugu News
Join

Guru Vandanam Awards Editor Bharath Speech: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకాదరాభిమానాలు చూరగొంటున్న ప్రముఖ వార్తా స్రవంతి జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో జరిగిన 'గురు వందనం ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అండ్ టీచర్ అవార్డ్స్' కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సదస్సుకు ప్రభుత్వ, ప్రైవేట్, ఇంటర్, ఉన్నత విద్యా రంగానికి చెందిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు, జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్ విద్యారంగాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

ఉపాధ్యాయుల విశిష్టత, జీతాల డిబేట్..
జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ తన ప్రసంగంలో సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను విశదీకరించారు. ఏ రంగానికి చెందిన వ్యక్తినైనా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే కాబట్టి వారికి ఎంత జీతం ఇచ్చినా తక్కువేనని, దానికి నిర్దిష్ట కొలమానం ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతించగలిగినంత వరకు ఎంత జీతం ఇచ్చినా తప్పులేదని, అసలు టీచర్ల జీతాల డిబేట్‌కే వెళ్లకూడదని వ్యాఖ్యానించారు. విద్యా కమిషన్‌కు సంబంధించిన సూచనను ప్రభుత్వం పక్కన పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

జీ తెలుగు న్యూస్ హామీ ఇదే! 
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది కాబట్టి ఉపాధ్యాయులందరికీ సమాజంలో తగిన గౌరవం అందించాలని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్ సూచించారు. అదే సమయంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందంటూ, హక్కులు, బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల పక్షాన జీ తెలుగు న్యూస్ ఎల్లప్పుడూ 100 శాతం నిలబడుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఈ నెల 18వ తేదీన టెలికాస్ట్ అవుతుందని వెల్లడించారు.

వేదికపై ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ నాయకులు కే కేశవరావు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ఢిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా పిలుపులో పాల్గొని రాత్రి 1:30 గంటలకు ల్యాండ్ అయినప్పటికీ ప్రత్యేకంగా హాజరయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప వ్యవధి పిలుపును మన్నించి తన షెడ్యూల్ మార్చుకుని విచ్చేశారు. అలాగే ఎంపీ ఈటల రాజేందర్ మాతృభాష ప్రాముఖ్యతపై మాట్లాడగా, 1981లో (45 ఏళ్ల క్రితం) ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కే కేశవరావు సభకు ముందుగానే వచ్చి అంశాలను నోట్ చేసుకోవడం విశేషం.

ఈ కార్యక్రమానికి శ్రీపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు, తపస్య విద్యా సంస్థలు, ఇంటర్ విద్యకు చెందిన జేసి మహసూన్ స్పాన్సర్లుగా వ్యవహరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES