SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సిద్దిపేటలో దారుణం.. ప్రేమ పెళ్లైన 6 నెలలకే భార్యను గొంతు నులిమి చంపిన భర్త..

Siddipet Crime News: పెళ్లయిన ఆరు నెలలకి చిన్న చిన్న మనస్పర్దాల కారణంగా భార్యను భర్త హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలోని చోటుచేసుకుంది.. బీహార్ కు చెందిన రాకేష్ ఆరు నెలల క్రితం స్థానికంగా నివసిస్తున్న ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... వీరు చిన్న మనస్పార్థాలతో రోజు గొడవపడే వారట. అయితే, ఆదివారం ఈ గొడవ పెరిగి గొంతు నులిమే కాడికి వచ్చింది..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 14, 2026, 01:37 PM IST | Updated: Sep 14, 2026, 01:40 PM IST
Image Credit: సిద్దిపేటలో దారుణం.. ప్రేమ పెళ్లైన 6 నెలలకే భార్యను గొంతు నులిమి చంపిన భర్త..
Join

Siddipet Telugu Crime News: ప్రేమించి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న భర్త ఆమె పాలిట యముడయ్యాడు.. ఆరు నెలల క్రితం ఒకటైన ఆ జంట మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పార్ధాలు నిండు ప్రాణాన్ని తీసాయి.. సిద్దిపేట పట్టణ శివారులో చోటుచేసుకున్న ఈ ధారణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. భార్యను కిరాతకంగా గొంతు నిలిమి హత్య చేసిన భర్త ఉదాంతం పై పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అసలు ఆ భర్త భార్యను చంపడానికి గల కారణాలేంటి? కేవలం మనస్పార్ధాలైనా? లేదా ఇంకేమైనా ఉన్నాయా? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాగదేవత గుడి శివారు ప్రాంతంలో ఈ ఘోర ఘటన వెలుగు చూసింది. స్థానికులతో పాటు పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన రాకేష్ ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కేంద్రంలోని ఒక టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.. స్థానికంగా ఉంటున్న రాజి అనే యువతి తో రాకేష్ కు మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆరు నెలల క్రితం వీరిద్దరూ హిమ వివాహం చేసుకున్నారు..

పెళ్లయిన కొద్ది రోజులు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా మనస్పార్థాలతో పాటు కుటుంబ కలహాలు మొదలయ్యాయి.. రోజురోజుకు వీరిద్దరి మధ్య వివాదాలు విపరీతమయ్యాయి.. ఈ క్రమంలోనే నాగదేవత గుడి సమీపంలోని వారి నివాసంలో దంపతుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో రాకేష్.. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి.. భార్య రాజి గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు.. విగత జీవిగా పడి ఉన్న యువతిని చూసి స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

సంఘంలోకి దిగిన పోలీసులు..
సమాచారం అందుకున్న వెంటనే సిద్ధిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించారు.. అనంతరం మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.. ఈ ఘటనపై మృతురాలి బంధువులతో పాటు స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కచ్చితంగా కారణాలతోపాటు వివాదాల వెనక ఉన్న అంశాలపై దర్యాప్తును కూడా ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.. పెళ్లయిన ఆరు నెలలకి యువతి అనుమాదాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆమె బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు..

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
 

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES