SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IPS Officers Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ.. సజ్జనార్‌ స్థానంలో మహేశ్‌ భగవత్‌

IPS Officers Transfers In Telangana: తెలంగాణలో మరోసారి పెద్ద ఎత్తున ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. హైదరాబాద్‌ నగరంతోపాటు కీలక విభాగాలకు చెందిన ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌ వంటి కీలక అధికారులు ఉన్నారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 12, 2026, 05:07 PM IST | Updated: Nov 12, 2026, 05:19 PM IST
Image Credit: Telangana IPS Officers
Join

Telangana IPS Officers: ఐపీఎస్‌ అధికారులను తెలంగాణ ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. పెద్ద ఎత్తున ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రంలోని కీలక విభాగాలకు చెందిన అధికారులను ప్రభుత్వం బదిలీ చేయగా.. బదిలీ అయిన వారిలో సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఉన్నారు. వీసీ సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌తోపాటు స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా తదితరులు ఉన్నారు.

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను అగ్నిమాపక దళానికి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో మహేశ్‌ మురళీధర్ భగవత్‌ను ప్రభుత్వ నియమించింది.

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను అగ్నిమాపక దళానికి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో మహేశ్‌ మురళీధర్ భగవత్‌ను ప్రభుత్వ నియమించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్‌ను ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ రెస్పాన్స్ విభాగం బాధ్యతలు అప్పగించారు. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రాను బదిలీ చేయగా.. ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా డీజీపీగా డాక్టర్ సౌమ్య మిశ్రాను ప్రభుత్వం నియమించింది.

ఏసీబీ డీజీగా చారు సిన్హాను నియమించగా.. సీఐడీ డీజీపీగా అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా డాక్టర్ అనిల్ కుమార్‌ను నియమించగా.. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్‌ను బదిలీ చేసింది. పౌర సరఫరాల కమిషనర్‌గా (సివిల్ సప్లైస్) వై. నాగిరెడ్డి బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్రను, ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ, రైల్వే ఐజీగా కె. రమేశ్‌ నాయుడును బదిలీ చేయగా.. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా డి. జోయల్ డేవిస్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఏడు, ఆరు జోన్ల డీఐజీ బాధ్యతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అడిషనల్ డీజీపీ (ఎల్ అండ్ ఓ)గా ఆకున్ సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES