Jagadish reddy: ఇవన్ని బ్లాక్ మెయిల్, డైవర్షన్ దందాలు.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి పంచ్‌లు..
Jagadish reddy fires on cm revanth: కోమటి రెడ్డి సోదరులకు కాంట్రాక్ట్ లు ఇచ్చే వరకు ఇష్టారితీన మాట్లాడుతారని ఆ తర్వాత సీఎం రేవంత్ ను పొగుడుతారంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అంతే కాకుండా ఇవన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలంటూ ఏకీపారేశారు.
Jagadish reddy Slams on Rajagopal reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇప్పటికే రాజకీయ దుమారం చెలరేగింది. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఇటివల ఘాటైన విమర్శలు చేశారు. అసలు సీఎం పదవి సైతం రేవంత్ కు ఏదో లక్ ఉండి దక్కిందని ఏకీపారేశారు. మునుగోడుకు నిధులు కేటాయించకుంటే మరో యుద్దమే నంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ నియోజక వర్గానికి నిధులు కేటాయించడంపై తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కేవలంలో కాంట్రక్ట్ ల కోసం మాత్రమే సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తారన్నారు. ఒకసారి వారికి కాంట్రక్ట్ లు దక్కగానే కాంగ్రెస్ ప్రభుత్వంను పొగుడుతారంటూ సెటైర్ లు వేశారు. ఇటీవల నకిరేకల్ సమావేశంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశసంలు కురిపించిన విషయంను మర్చిపోయారా అంటూ పంచ్ లు వేశారు. కోమటి రెడ్డి బ్రదర్స్ కు ఒక్క కాంట్రక్ట్ దక్కితే తెల్లారే జై రేవంత్ అంటారన్నారు.
రాజగోపాల్ రెడ్డికి రాజీనామా చేసేంత ధైర్యంలేదని, కేవలం కాంట్రక్ట్ లో కోసం పోటీపడి విమర్శలు చేస్తారన్నారు. కోమటిరెడ్డికి ఎమ్మెల్యే పదవికి కాదు.. కేవలం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఇవన్ని కేవలం డైవర్షన్, బ్లాక్ మెయిల్ రాజకీయాలని రాజగోపాల్ రెడ్డిని ఏకీపారేశారు.
కోమటి రెడ్డి బ్రదర్స్ ను చూసి కొండా సురేఖ బలైపోయిందన్నారు. వీరు తనకు సపోర్ట్ గా వస్తారని భావించి, కొండా సురేఖ మోసపోయిందన్నారు. మొత్తంగా జగదీశ్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు పంచ్ లు వేశారు.
మరోవైపు ఏడాది నుంచి నాగార్జున సాగర్ వద్ద ఇంత పెద్ద ప్రాజెక్టు జరుగుంటే.. ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదంటూ ఫైర్ అయ్యారు. మోడీ, చంద్రబాబులను కాకా పట్టి రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవాలనే రేవంత్ మాట్లాడలేదా? .. అంటూ జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్.. నీ ఉత్తర ప్రగల్భాలు వొద్దంటూ పంచ్ లు వేశారు.
నాగార్జున సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం జల దోపిడీకి ప్రయత్నం చేస్తోందనే సమాచారం మీకు ఏ రోజు వచ్చింది..? ఎప్పుడు మీరు KRMBకి లేఖ రాశారో అది బయటపెట్టాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. నువ్వు అబద్ధం మాట్లాడావని నీ సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండని, ఒకవేళ నువ్వు మాట్లాడేది నిజమే అయితే.. నువ్వు రాసిన లేఖను బయటపెట్టాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు.