జగిత్యాలలో ఏసీబీ దాడులు.. EMI పద్ధతిలో లంచం తీసుకుంటూ చిక్కిన CDPO దారోజు పద్మ..!!
Jagtial ACB Raid: అవినీతి అధికారులు లంచాలు తీసుకోవడంలో కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాధారణంగా ఒకేసారి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసే అధికారులు, ఇక్కడ మాత్రం వినూత్నంగా నెలవారీ వాయిదాల పద్ధతిలో మామూళ్లు వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ విస్తుపోయే ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వెలుగుచూసింది.

అంగన్‌వాడీ కేంద్రాలపై తనిఖీల పేరుతో లంచం డిమాండ్ చేసిన అధికారిణి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీఓ దారోజు పద్మను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున... మూడు నెలలకు రూ.63 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.మెట్‌పల్లి కార్యాలయం వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు.
ఆమె వద్ద నుంచి మొత్తం రూ.63 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీఓను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.ప్రభుత్వ అధికారులకు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.