SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kavitha Speech: పంటలు వేయవద్దన్న రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండే హక్కు లేదు: కవిత

Kavitha Comments In Indravelli Public Meeting: పంటలు వేసుకోవద్దని చెప్పిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదని మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ముందుకు సాగిందని గుర్తు చేసుకున్నారు. ఇంద్రవెల్లి సభలో కవిత ప్రసంగం ఇలా ఉంది.

Written By Ravi Kumar Sargam
Published: Oct 30, 2026, 07:32 PM IST | Updated: Oct 30, 2026, 07:35 PM IST
Image Credit: Kavitha Indravelli Meeting
Join

Indravelli Kavitha Meeting: 'చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పంటలు వేయవద్దు అని చెప్పింది రేవంత్ రెడ్డి మాత్రమే. పంటలు సాగు చేయ వద్దు అనే ముఖ్యమంత్రి కి పదవిలో ఉండే హక్కు లేదు' అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత తెలిపారు. పంటలు వేయవద్దని చెబుతున్న రేవంత్‌ రెడ్డి మరి రైతులు ఎలా బతకాలో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వారిని గెలిపిస్తే ప్రయోజనం లేదని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో కవిత కీలక ప్రసంగం చేశారు. 'ఇంద్రవెల్లిలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మారణహోమం సృష్టించింది. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరులను రేవంత్ రెడ్డి అవమానపరిచాడు. రాబోయే ఎన్నికల్లో మొదటి జెండా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఎగురుతుంది' అని విశ్వాసం వ్యక్తం చేశారు. 'ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ నాయకులకు అభివృద్ధి పట్టదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 20 శాతం వాట ఆదిలాబాద్ నుంచే వస్తుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశించిన అభివృద్ధి జరగలేదు' అని కవిత తెలిపారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రకటించారు.

అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కవిత ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని కవిత తెలిపారు. ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ముందుకు సాగిందని గుర్తు చేశారు. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

'ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయలేదు. ఎందుకు ఆదిలాబాద్ సీసీఐని ప్రారంభించలేదు. గోదావరి, ప్రాణహిత నది నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి నీళ్లు ఎందుకు ఇవ్వలేదు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చణాఖా కొరటా బ్రిడ్జి నిర్మాణంలో పెరిగిన రూ.1,700 కోట్లు ఎక్కడికి పోయాయో చెప్పాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరి రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. జీవో 49 పేరిట 15 వందల ఎకరాల ఆదివాసీ భూములు తీసుకొని వారికి అన్యాయం చేశారని.. జీవో 49ని రద్దు చేయాలని కవిత డిమాండ్‌ చేశారు.

'జీవో 49 పేరిట 15 వందల ఎకరాల ఆదివాసీ భూములు తీసుకొని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. జీవో 49ని రేవంత్ రెడ్డి రద్దు చేయాలి' అని కవిత డిమాండ్‌ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఉండి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని తెలిపారు. మంత్రిగా ఉండి జిల్లా కేంద్రం మంచిర్యాలలో ఒక్క అధికారిక కార్యక్రమం కూడా నిర్వహించని పరిస్థితి వివేక్ వెంకటస్వామిది అని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ వారిని గెలిపిస్తే ప్రయోజనం లేదని.. తమ పార్టీని గెలిపించాలని కవిత కోరారు.

కవిత పాంచజన్య హామీలు
మీ ఆడబిడ్డను అధికారంలోకి తీసుకువస్తే ప్రైవేట్ విద్యాలయాల్లో ఉచిత విద్య అందిస్తా 
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందించి చూపిస్తా 
యువతకు ఎన్ని లక్షల రూపాయల రుణాలు ఇప్పిస్తా 
అమలు కానీ 25 ఆదివాసీ జీవోలు అమలు చేస్తా

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES