KT Rama Rao Strong Counter To Revanth Reddy Comments: తన ఆస్తులు, వ్యాపారంపై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా ఆస్తులు, నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని సవాల్ చేశారు. తన హోటళ్లకు ఉచిత ప్రచారం చేసిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Social Media Influencers: ఏపీలో ప్రభుత్వ ప్రచారానికి సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లకు మధ్య నగదు చెల్లింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది..! కూటమి సర్కార్‌లో కార్యకర్తల కోసమే ప్రజల డబ్బు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి..! రాజమండ్రిలో జరిగిన పర్యాటక దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం అనుకుంటున్న సోషల్ మీడియా బూస్టప్ ఆరంభంలోనే బెడిసి కొట్టిందా..!
Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ దూకుడు పెంచింది..! వచ్చే ఎన్నికలే టార్గెట్ గా జంపింగ్‌లకు తెరతీసింది..! వారం రోజుల వ్యవధిలో ముగ్గురు కీలక నేతలు.. జనసేన పార్టీలో చేరిపోయారు..! ఇందులో ఓ మాజీమంత్రి సైతం ఉన్నారు..! ఇప్పుడు వీరిబాటలోనే ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం సాగుతోంది..! ఇప్పుడు జనసేన పార్టీలో వరుస చేరికలు.. మిత్రపక్షాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయా..! ఇన్నాళ్లు చేరికల విషయంలో కాస్తా సైలెంట్ గా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడెందుకు దూకుడు చూపిస్తున్నారు..! దీని వెనుక ఉన్న అసలు సిసలైన్ పొలిటికల్ గేమ్ అదేనా..!
Telangana Graduate MLC Elections: తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదంతో కేసీ వేణుగోపాల్ వీరి పేర్లను ప్రకటించారు. దామోదర రాజనర్సింహా, భట్టి విక్రమార్క నేత్రుత్వంలోని కమిటీ సిఫార్సులు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత అభ్యర్థుల ఎంపిక పూర్తి అయ్యింది. సామాజిక సమీకరణాల కంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైనట్లే.
Telangana Politics: కాంగ్రెస్ పార్టీలో రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత టెన్షన్ పట్టుకుందా..! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటు పడటంతో.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారా..! దానం నాగేందర్ తీర్పే తమకు వర్తిస్తుందనే ఆందోళన పడుతున్నారా..! వచ్చే నెలలో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యేపై హైకోర్టులో విచారణ ఉండటంతో.. ఆయనపైన వేటు తప్పదనే చర్చ జరుగుతోందా..! మరో రెబల్ ఎమ్మెల్యేకు ప్రభుత్వ సలహాదారు పోస్టు శాపంగా మారిందని అంటున్నారా..! త్వరలోనే ఇద్దరిపైన వేటు పడుతుందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోందా..!
Malla Reddy: మాజీమంత్రి మల్లారెడ్డి కుటుంబం పార్టీ మారడం ఖాయమైందా..! త్వరలోనే ఆయన కుటుంబంతో కలిసి కాషాయ కండువా మార్చుకునేందుకు రెడీ అయ్యారా..! ఆస్ట్రేలియాలో మల్లారెడ్డి, బీజేపీ నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు సైతం జరిగియా..! బీజేపీలో చేరితే.. రెండు ఎమ్మెల్యే టికెట్లతో పాటు.. ఎంపీ టికెట్ కావాలని అధిష్టానం పెద్దలను కోరగా.. రెండు టికెట్ల ప్రతిపాదనకు కాషాయ పెద్దలు ఓకే చెప్పారా..! ఇప్పుడు అధికార పార్టీని వదిలేసి.. కమలం పార్టీలో చేరేందుకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు..! దీని వెనుక ఉన్న అసలు కథేంటి..!
Uttam Kumar Reddy: తుమ్మిడిహెట్టిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అవగాహనలేని రీ–ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేశారని.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగం భ్రష్టుపట్టిందన్నారు. రూ.38 వేల కోట్ల ప్రణాళికను లక్ష కోట్లకు మించిన అప్పుల భారంగా మార్చారని ఫైర్ అయ్యారు.