SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: పెళ్లిపేరుతో నమ్మించి లైంగిక దాడి.. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా అరెస్ట్..డిపార్ట్ మెంట్ లో కలకలం..

Khairtabad detective inspector row: తన మొదటి భర్త మంచాన పడిన సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని మహిళ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భర్త మరణించిన తర్వాత కూడా తనతో ఉన్నాడని మహిళ చెప్పుకొచ్చింది. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 11, 2026, 04:52 PM IST | Updated: Oct 11, 2026, 05:00 PM IST
Image Credit: khairabadinspectorbalaswami(file)
Join

Khairtabad detective inspector arrested over cheating woman: సమాజంలో పోలీసులను ఎంతో గౌరవంగా చూస్తారు. ఖాకీ జాబ్ ను ఎంతోకష్టపడి సాధించి తమ పర్సనల్ లైఫ్ ను సైతం పణంగా పెడుతారు. అయితే.. కొంత మంది ఖాకీ ముసుగులో కామాంధులు పోలీసు స్టేషన్ కు ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారిపట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను వేధించడం, బాధితుల బలహీనతలను ఆసరాగా చేసుకుని తమ కామవాంఛలను తీర్చుకుంటున్నారు.

  హైదరాబాద్ లోని ఖైరతాబాద్ పీఎస్ లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి  మహిళకు మాయ మాటలు చెప్పి ఆమెనుతన ట్రాప్ లో వేసుకున్నాడు. ఈ ఘటన డిపార్ట్ మెంట్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బాలస్వామిపై మహిళ ఫిర్యాదు ఘటన డిపార్ట్ మెంట్ లో తీవ్ర కలకలంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2017 నుంచి తనతో సంబంధం కొనసాగించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన భర్త మంచాన పడిన సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భర్త మరణించిన తర్వాత కూడా పెళ్లి హామీ ఇచ్చి సంబంధాన్ని కొనసాగించాడని ఆరోపించింది. 

అయితే..  బాలస్వామికి ఇప్పటికే పెళ్లైందని తెలుసుకుని నిలదీయగా, విడాకులు తీసుకున్నానని చెప్పి మోసం చేశాడని మహిళ ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని అడగగా ముఖం చాటేశాడని వాపోయింది.ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదుతో సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్లు 69, 81, 351(2), 352 కింద కేసు నమోదు చేసుకుని  బాలస్వామిని అరెస్ట్ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES