Telangana: కార్తీక మాసం వేళ అద్బుతం.. పుట్టలో బైటపడ్డ శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం.. ఎక్కడంటే..?
Lakshmi Narasimha Swamy idol in medak: దేవుల పల్లి గ్రామానికి చెందిన భక్తుడు తనకు కలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కన్పించి పుట్టలో తాను ఉన్నానని బైటకు తీయాలని చెప్పారని గ్రామస్తులతో, అక్కడి పూజారులకు చెప్పాడు. దీంతో అతను చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. దీంతో అక్కడ కన్పించిన విగ్రహంచూసి అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
Lakshmi Narasimha Swamy idol found medak: దేశ వ్యాప్తంగ ఎక్కడ చూసిన కార్తీక మాసం శోభ కన్పిస్తుంది. శివ, వైష్ణవ ఆలయాలన్ని భక్తులతో కిట కిట లాడుతున్నాయి. అంతే కాకుండా ప్రతి రోజు కూడా భక్తులు తమ దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్లి తమ ఇష్టదైవాన్ని స్మరించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.ఈ క్రమంలో ఎక్కడచూసిన కార్తీక మాస ఆధ్యాత్మిక శోభ కన్పిస్తుంది. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడి పల్లి మండలం దేవుల పల్లి గ్రామంలో ఒక భక్తుడికి కలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కన్పించినట్లు చెప్పాడు.
తెలంగాణలోని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలోని కార్తీక మాసంవేళ అధ్బుతం చోటు చేసుకుంది. దేవుల పల్లికి గ్రామానికి చెందిన వ్యక్తి తనకు కలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కన్పించారని, ఆయన స్థానికంగా ఉన్న పుట్టలో ఉన్నారని, బైటకు తీయాలని తనతో చెప్పారని స్థానికులకు చెప్పాడు. అతను చెప్పినట్లే గ్రామస్తులు, పూజారులు వెళ్లి అక్కడ తవ్వకాలు చేపట్టారు.
అయితే.. అతను చెప్పిన దాని ప్రకారం పుట్టను తవ్వి చూడగా అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి పురాతన విగ్రహం బైటపడింది. దీంతో గ్రామస్తులంతా భక్తి శ్రద్దలతో పొంగిపోయారు. ఎన్నో ఏళ్లుగా మట్టిలో ఉన్న స్వామి ఈరోజు బైటకు రావడంతోగ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం కాస్త చుట్టుపక్కల గ్రామాలకు పాకడంతో భారీగా ప్రజలు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొవడానికి క్యూలు కట్టారు. అభిషేకాలు చేసిపూజలు చేస్తున్నారు.
మరొవైపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహంను శుభ్రంగా నీళ్లతో, పంచామృతాలతో అభిషేకం చేసి భక్తుల సందర్శణ కోసం తాత్కలికంగా ఏర్పాటు చేసిన రాతి గద్దెపై స్వామినిఉంచారు. తొందరలోనే అక్కడ దాతల సహాయంతో ఆలయంను నిర్మిస్తామని గ్రామస్తులు వెల్లడించారు. కార్తీక మాసంలో ఈ ఘటన చోటుచేసుకొవడంతో గ్రామస్తులు ఆ స్వామి వారు తమను అనుగ్రహించడ కోసం వచ్చారని భక్తితో పొంగిపోతున్నారు.