Ponnam Prabhakar: కుర్చీలో దర్జాగా డిపో మేనేజర్, నేలపై ఆర్టీసీ కార్మికులు.. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్..
Minister ponnam prabhakar: సిద్దిపేట్ ఆర్టీసీ డిపో మేనెజర్ వివాదం కాస్త రచ్చగా మారడంతో దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. దీనిపై తగిన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
Minister ponnam prabhakar serious on siddipet depot manager incident: తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేరుస్తునే మరోవైపు పాలనలో సీఎ రేవంత్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మణుగురులో ప్రవళిక ఘటనపై ఆర్టీసీ బస్సులను నడిపే క్రమంలో డ్రైవర్లు, కండక్టర్ లు తగు జాగ్రత్తలు తీసుకొవాలని ఆదేశించింది.
అదే విధంగా ఆర్టీసీలో బస్సు డ్రైవర్ లు, కండక్టర్ లపై దాడుల ఘటనలపై కూడా సీరియస్ అయ్యింది.ఈ క్రమంలో తాజాగా.. సిద్దిపేట్ ఆర్టీసీ డిపో మేనేజర్ కుర్చిలో కూర్చుని మాట్లాడటం, కార్మికులు నేలపై కూర్చుని మాట్లాడిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ గా స్పందించారు.
సిద్దిపేట్ లోని ఆర్టీసీ డిపోలో డీఎంతో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలపై మాట్లాడేందుకు జాక్ నేతలు, కార్మికులు ఆఫీసుకు వెళ్లారు. అయితే.. ఆర్టీసీ డీఎం దర్జాగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన ముందు మాత్రం పాపం.. జాక్ నేతలు, ఆర్టీసీ కార్మికలు నేలపై కూర్చుని ఉన్నారు. వారు నేలపై కూర్చుని తమ గొడును చెప్తుంటే ఆర్టీసీ డీఎం చైర్ లో కూర్చొవడం పెను వివాదంగా మారింది.
కనీసం జాక్ నేతలకు, ఆర్టీసీ కార్మికులు డీఎం ఇచ్చే గౌరవమా అంటూ ఆర్టీసీ సంఘం నేతలు మండిపడుతున్నారు. దీనిపై నెట్టింట వివాదం రాజుకుంది. ఇదేనా ప్రజాప్రభుత్వమంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ వివాదం కాస్త మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి చేరింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ కార్మికులు నేలపైన కూర్చుండ బెట్టి మాట్లాడిన ఘటనను ఖండించారు. అంతే కాకుండా దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. ఇలాంటి పనులతో ప్రభుత్వంకు చెడ్డపేరు తీసుకుని రావొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ తెల్చిచెప్పారు.