Minor Girl gang raped in siddipet: ప్రభుత్వాలు ఎన్నికఠిన చర్యలు తీసుకున్న కామాంధుల్లో మార్పులు రావడం లేదు. ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి. పసిపాప నుంచి పండు ముసలి వరకు అందరు వేధింపులకు గురౌతున్నారు. ముఖ్యంగా మైనర్ లపై దాడులు, అత్యాచారాలపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన కూడా నేరస్థుల్లో భయం మాత్రం ఉండటంలేదు.
సోషల్ మీడియా ప్రభావం, ఆన్ లైన్ లో ఆశ్లీల వీడియోలను చూసి కొంత మంది ఉన్మాదులగా మారుతున్నారు. వీరిలో మైనర్ లు కూడా ఉండటంతో సమాజం ఎటుపోతుందని అందరు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సిద్దిపేట్ జిల్లాలో ధూల్మిట్ట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దసరా పండగ రోజు బాలికను మరో గ్రామానికి తీసుకెళ్లి, మరుసటి రోజు ఉదయం గ్రామంలో వదిలేసినట్లు చెప్పారు.
ఈ క్రమంలో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దారుణంకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది. మరోవైపు గ్రామంలో గొడవలు జరక్కుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీసీ ఫుటేజీని జల్లెడపడుతున్నారు.