SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: బతుకమ్మను ఎత్తిన ముస్లిం మహిళలు.. ట్యాంక్ బండ్ వద్ద అరుదైన దృశ్యం.. వీడియో..

Saddula bathukamma celebrations: తెలంగాణలో బతుకమ్మ సంబరాలను ఊరు, వాడ,పల్లెపట్నం తేడా లేకుండా వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ సంబరాల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 19, 2026, 07:23 PM IST | Updated: Oct 19, 2026, 07:35 PM IST
Image Credit: Muslim Women saddula bathukamma in hyderabad
Join

Muslim women participated in saddula bathukamma in Hyderabad: తెలంగాణలో బతుకమ్మ పండగను అనాదీగా మన ఆచారం, సంస్కృతికి చిహ్నంగా చెప్తారు. చిన్న, పెద్దా తేడా లేకుండా మహిళలు బతుకమ్మ సంబరాల్ని ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి .. దాని మధ్యలో గౌరమ్మని నిలిపుతారు. భక్తితో రోజుకో పేరుతో పూజలు చేస్తారు. 

 

 

పూలను అందంగా అలంకరించి బరువులెక్క చేయక నెత్తి మీద నిలిపి, చేతిలో చిన్న బతుకమ్మ ను, చెంగులో పంచడానికి పలారం బుట్టను పట్టుకుంటారు. ఈ విధంగా భక్తితో బతుకమ్మ సంబరాల్ని నిర్వహించుకుంటారు. నిన్న తెలంగాన వ్యాప్తంగా సద్దుల బతుకమ్మతో  ఈ వేడుక ముగిసింది.అయితే.. ట్యాంక్ బండ్ వద్ద అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.

మనం అనాదీగా భిన్నత్వంలో ఏకత్వంను పాటిస్తారు. గంగా జమునా తెహజీబ్ సంస్కృతుల సమ్మేళనం నా తెలంగాణ అంటూ గర్వంగా చెప్పుకుంటాం. భిన్న మతాలు, కులాల వారుఉన్న కూడా పండగలు రాగానే సంతోషాలతో వేడుకలను నిర్వహించుకుంటాం. 

ఈ క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఇద్దరు ముస్లిం మహిళలకు పాల్గొనడమే కాకుండా తల మీద బతుకమ్మను ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో అక్కడి వారంతా ముస్లిం మహిళలు చాటిన గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ఫిదా అయ్యారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక నిన్న ట్యాంక్ బండ్ లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో రష్మిక మందన్న, విజయ్ దేవర కొండ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. తెలంగాణకు కొత్త కోడలిగా తన తొలి పండగ అంటూ రష్మిక మందన్న సద్దుల బతుకమ్మ ఆడుతూ అందరిలో జోష్ ను నింపారు. రష్మిక మందన్న,విజయ్ దంపతులు బతుకమ్మ చుట్టు తిరుగుతూ మన సంప్రదాయంను పాటిస్తు అభిమానుల్లో కొత్త ఆనందాన్ని నింపారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES