SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆదిలాబాద్ పల్లె నుంచి అందాల పోటీ వరకు... మిస్ ఎర్త్ వాటర్ ఇండియా గా ప్రీతి ముండే సక్సెస్ స్టోరీ..!!

Preeti Munde: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి జాతీయ స్థాయి అందాల పోటీల్లో సత్తా చాటింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే ‘మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026’ టైటిల్‌ను గెలుచుకుంది.

Written By Bhoomi
Published: Sep 26, 2026, 08:54 AM IST | Updated: Sep 26, 2026, 08:56 AM IST
Image Credit: Preeti Munde Miss India Earth Water 2026
Join

Preeti Munde: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి జాతీయ స్థాయి అందాల పోటీల్లో సత్తా చాటింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే ‘మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026’ టైటిల్‌ను గెలుచుకుంది. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆమెకు మరో ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది.

జైపూర్ వేదికగా విజయం:
డివైన్ బ్యూటీ గ్రూప్ నిర్వహించిన ‘మిస్ డివైన్ బ్యూటీ 2026’ గ్రాండ్ ఫినాలే ఈ నెల 19న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించిన ప్రీతి ముండే ‘ఎర్త్’ విభాగంలోని ‘వాటర్’ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ప్రధాన కిరీటమైన ‘డివైన్ మిస్ ఎర్త్ ఇండియా 2026’ను మహారాష్ట్రకు చెందిన ఆర్య ఆవధూత్ గెలుచుకోగా.. ఎలిమెంటల్ టైటిల్స్‌లో భాగమైన ‘మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026’గా ప్రీతి ఎంపికైంది.

మిస్ కంజీనియాలిటీ అవార్డు కూడా:
పోటీల్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న ప్రీతికి మరో ప్రత్యేక గౌరవం దక్కింది. ‘మిస్ కంజీనియాలిటీ’ అవార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది. పోటీలో పాల్గొన్న వారితో స్నేహపూర్వకంగా మెలగడం, తన వ్యక్తిత్వంతో ఆకట్టుకోవడం వంటి అంశాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

హీరాపూర్ నుంచి హైదరాబాద్.. అక్కడి నుంచి జాతీయ వేదికకు:
ప్రీతి ముండే స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్. చిన్న గిరిజన గ్రామం నుంచి వచ్చిన ఆమె.. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.

మోడలింగ్‌లో ఇప్పటికే పలు టైటిళ్లను ఆమె అందుకుంది. ‘మిస్ హైదరాబాద్ రన్నరప్’గా నిలిచిన ప్రీతి.. ‘మిస్ మహారాష్ట్ర - బ్రెయిన్ విత్ బ్యూటీ’ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. తాజాగా జాతీయ స్థాయి వేదికపై ‘మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026’ కిరీటం దక్కించుకోవడంతో ఆమె ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

మోడలింగ్‌తో పాటు ఇతర రంగాల్లో ఆసక్తి:
మోడలింగ్‌కే పరిమితం కాకుండా ప్రీతికి జ్యోతిష్యం, టారోట్ రీడింగ్ వంటి అంశాలపైనా ఆసక్తి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ రంగాలపై ఆసక్తిని పెంచుకుంటూ తన ప్రతిభను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

గ్రామంలో హర్షాతిరేకాలు:
తమ ప్రాంతానికి చెందిన యువతి జాతీయ స్థాయి అందాల పోటీలో టైటిల్ గెలుచుకోవడంతో హీరాపూర్ గ్రామంలో ఆనందం వ్యక్తమవుతోంది. మారుమూల గిరిజన ప్రాంతం నుంచి జాతీయ వేదిక వరకు ప్రీతి సాగించిన ప్రయాణం స్థానిక యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని గ్రామస్థులు అభినందిస్తున్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే గ్రామీణ నేపథ్యం అడ్డంకి కాదని ప్రీతి ముండే విజయం చాటిచెప్పిందని కుటుంబ సభ్యులు, స్థానికులు పేర్కొంటున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES