SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విద్యార్థిపై RTC అద్దె బస్సు డ్రైవర్ దాడి.. బస్సు కింద పడేసి చంపేస్తానంటూ బెదిరింపులు!

RTC Bus Driver Attack: ఓ RTC అద్దె బస్సు డ్రైవర్ విద్యార్థి పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. విద్యార్థితో పాటు డ్రైవర్ మధ్య మాట మాట పెరగడంతో.. డ్రైవర్ విచక్షణా కోల్పోయి విద్యార్థి పై దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 19, 2026, 10:34 AM IST | Updated: Sep 19, 2026, 10:34 AM IST
Image Credit: విద్యార్థిపై RTC అద్దె బస్సు డ్రైవర్ దాడి.. బస్సు కింద పడేసి చంపేస్తానంటూ బెదిరింపులు!
Join

RTC Bus Driver Attack Telugu News: మహబూబ్నగర్ జిల్లా నెల్లి కుదురు మండల కేంద్రంలోని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన చోటుచేసుకుంది. బడికి వెళ్లే ఒక పేద విద్యార్థిపై తొర్రూరు డిపోకు చెందిన RTC అద్దె బస్సు డ్రైవర్ మానవత్వం మరిచి ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి దాడికి దిగడమే కాకుండా.. బస్సు కింద పడేసి చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేసాడు. స్థానికులతో పాటు తోటి విద్యార్థులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటన నెల్లికుదురు వ్యవసాయ మార్కెట్ కు అతి సమీపంలో చోటుచేసుకుంది..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రావిరాల గ్రామానికి చెందిన భార్గవ్ నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతూ ఉన్నాడు. ప్రతి రోజు లాగే స్కూలుకు వెళ్లేందుకు వచ్చిన ఆ విద్యార్థితో.. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు  (TS 26 T 1266) డ్రైవర్ ఘర్షణకు దిగాడు.. ఇద్దరి మధ్య మాటలు పెరగడంతో సహనం కోల్పోయిన సదరు డ్రైవర్.. విద్యార్థి అని కూడా చూడకుండా భార్గవ్ పై ఊహించని స్థాయిలో విచక్షణారహితంగా దాడి చేశాడు..

ఈ దాడిలో విద్యార్థి శరీర భాగాలపై తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా.. నిన్ను బస్సు టైర్ల కింద పడేసి చంపుతాను అంటూ బహిరంగంగానే ప్రాణహాని బెదిరింపులకు ఆ డ్రైవర్ పాల్పడ్డాడు.. ఈ సమయంలో డ్రైవర్ ఆగడాలను చూసిన తోటి ప్రయాణికులతో పాటు స్థానికులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది..

గతంలోనూ విద్యార్థులపై ఇదే రకం..
సదరు డ్రైవర్‌కు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అలవాటుగా మారిందని స్థానికులతో పాటు విద్యార్థులు కూడా ఆరోపిస్తూ వస్తున్నారు.. గతంలో కూడా పలువురు విద్యార్థులపై ఇలాగే చేతులు చేసుకున్నాడని.. ఆలోచితంగా ప్రవర్తించాడని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.. విద్యార్థుల బస్సు పాసులను నిర్లక్ష్యం చేయడం.. వారిని ఎక్కించుకోకపోవడంతో పాటు.. ప్రశ్నిస్తే బూతులు తిడుతూ దాడులకు పాల్పడడం ఇతనికి అలవాటేనని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

అయితే, ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోగ్యం చేసుకోవాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు సేవలు అందించాల్సిన RTC సిబ్బందితోపాటు అద్దె బస్సు డ్రైవర్లు పేద విద్యార్థుల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి భార్గవ్ పై దాడి చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించిన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేయాలని.. ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే ఈ ఘటన పై విచారణ జరిపి డ్రైవర్ను విధుల్లో నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలతో పాటు స్థానికులు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES