SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Seethakka Emotional: తన రాజకీయ జీవితంపై భావోద్వేగానికి లోనయిన సీతక్క

Seethakka Emotional Speech: నక్సలైట్‌ నుంచి రాజకీయ నాయకురాలిగా.. మంత్రిగా ఎదిగిన సీతక్క అలియాస్‌ ధనసరి అనసూయ తన రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగాయని చెప్పుకొచ్చారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 24, 2026, 10:02 PM IST | Updated: Oct 24, 2026, 10:04 PM IST
Image Credit: Source: Seethakka Twitter
Join

Hyderabad: తన బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు.. రాజకీయాల్లో ఎన్నో పదవులు అనుకోకుండా పొందినట్లు తెలంగాణ మంత్రి సీతక్క అలియాస్‌ ధనసరి అనసూయ తెలిపారు. కలి బాధలు అనుభవించానని.. అయినప్పటికీ అన్ని కష్టాలను ఎదుర్కొని తాను నేడు ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడు తన మూలాలు మరిచిపోలేదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సీతక్క కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన కష్టాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 'నా జీవితం కష్టాల కలపోత, పోరాటాల మయం. నా కష్టాలను. పోరాటాలను ఎప్పటికీ మర్చిపోను' అని తెలిపారు. 'నా చిన్నతనంలో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. ఆకలి బాధలు అనుభవించా. అయినప్పటికీ అన్ని కష్టాలను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకున్నా. ములుగు ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పెద్దల అండదండలతో అతిపెద్ద శాఖ అయిన పంచాయతీరాజ్ శాఖకు మంత్రి కాగలిగా. నాకు ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు' అని సీతక్క తెలిపారు.

'అపర వనరులు ఉన్న ప్రాంతం ములుగు. అలాంటి ప్రాంతంలో ఒక పేద కుటుంబంలో నేను జన్మించా. చిన్నతనంలో అన్యాయాలను చూడలేక నక్సలైట్ అయ్యా. నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు. కానీ నక్సలైట్ అయ్యాను. ఆ తర్వాత లాయర్, ఎమ్మెల్యే, మంత్రి అవుతానని ఎన్నడూ ఊహించలేదు' అని సీతక్క చెప్పుకొచ్చారు. కానీ కష్టాన్ని నమ్ముకొని పనిచేశానని తెలిపారు. 'నేను మంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడు నా మూలాలు మరిచిపోలేదు. ప్రజా జీవితమంటే ప్రజలతోనే ఉండాల్సిందే' అని స్పష్టం చేశారు.

'ఇప్పటికీ ప్రతివారం రెండు రోజులు నేను నా ములుగు ప్రజల మధ్యనే ఉంటా. ప్రజలతో ఎన్నుకోవడంతో ప్రజలతోనే ఉండాలన్నది నా సిద్ధాంతం' అని సీతక్క తెలిపారు. ఎమ్మెల్యే, మంత్రి కాగానే ప్రజలతో దూరంగా ఉండాలని.. అప్పుడే గౌరవం కలుగుతుందని  కొందరు భావిస్తారు. కానీ నేను ఆ భావనకు పూర్తి విరుద్ధం. మనం ప్రజలకు జవాబుదారులం. మనం బాసులం కాదు సేవకులం' అని వెల్లడించారు. చేపకు నీళ్లే బలం.. అలాగే నాయకులకు ప్రజలే బలం అని స్పష్టం చేశారు. నీళ్లు లేకుండా చేప బతకదు.. ప్రజలు లేకుండా నాయకుడు రాజకీయంగా బతకడని పేర్కొన్నారు.

'మహిళలు ఎంత ఎత్తు కలిగిన వివక్షతను ఎదుర్కొంటూనే ఉంటారు. పురుష మంత్రులకు వచ్చినంత గౌరవం మహిళా మంత్రులకు ఇవ్వరు. పురుష మంత్రులను గౌరవించినట్టుగా.. మహిళా మంత్రులను గౌరవించరు. ఆయనప్పటికీ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు' అని సీతక్క తెలిపారు. 'మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలి. మహిళల రాజకీయ ఎదుగుదలలో ఎన్నో వంటకాలు ఎదురవుతాయి. వాటన్నిటికీ భయపడకుండా  వాటిని అధిగమించి మహిళలు ఉన్నత స్థానాల్లోకి చేరుకోవాలి' అని ఆకాంక్షించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES