SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సింగరేణి కార్మికులకు దసరా ధమాకా .. ఒక్కొక్కరికి రూ. 1.53 లక్షల వరకు బోనస్.. సర్కార్ బిగ్ అనౌన్స్‌మెంట్!

Singareni Workers Bonus: దసరా పండుగ పురస్కరించుకుని సింగరేణి సంస్థ.. తన ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్ తెలిపింది. సంస్థలో సేవలు అందిస్తున్న రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా దసరా నజరానాను ప్రకటించింది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 13, 2026, 01:31 PM IST | Updated: Oct 13, 2026, 01:32 PM IST
Image Credit: Singareni Workers Bonus
Join

Singareni Workers Bonus: దసరా పండుగ పురస్కరించుకుని సింగరేణి సంస్థ.. తన ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్ తెలిపింది. సంస్థలో సేవలు అందిస్తున్న రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా దసరా నజరానాను ప్రకటించింది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి ఒక్కరికీ రూ.5,500 చొప్పున పండుగ బోనస్ అందించనున్నారు. 

 అదే సమయంలో, సంస్థ సాధించిన మొత్తం నికర లాభాల్లో ఏకంగా 34 శాతాన్ని పర్మినెంట్ కార్మికులకు లాభాల వాటాగా పంచాలని యాజమాన్యం నిర్ణయించింది. దసరా పండుగ వేళ ప్రభుత్వం.. సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో బొగ్గు గని కార్మికుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది.

సింగరేణి సాధించిన నికర లాభాల్లో 34శాతం పర్మినెంట్ కార్మికులకు బోనస్ అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులు అయిన ప్రతి కార్మికుడికి గరిష్టంగా రూ. 1.53.913 వరకు అందించనుంది. పండగకు ముందే ఈ మొత్తాన్ని కార్మికుల బ్యాంకు అకౌంట్లో జమ చేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. 

గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా కాంట్రాక్టు కార్మికులకు బోనస్ అందించనున్నట్లు వెల్లడించింది. ఒక్కొక్కరికి రూ. 5,550 చొప్పున చెల్లించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. దీంతో సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కుటుంబాల్లో దసరా ఆనందం నిండనుందని చెప్పాలి.

బొగ్గు గనుల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తూ సంస్థ అభివ్రుద్ధికి తోడ్పడుతున్న కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని యాజమాన్యం పేర్కొంది. పండగ వేళ బోనస్ ప్రకటనతో కార్మికుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES