SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణ స్కాలర్‎షిప్‎తో ఏపీలో విద్య.. స్థానికత వర్తిస్తుందా లేదా?

Telangana High Court: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ను ఏపీలో బీడీఎస్ పూర్తి చేసిన విద్యార్థికి తెలంగాణలో ఎండీఎస్ ప్రవేశాల్లో స్థానికత వర్తిస్తుందా లేదా అనే అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం.. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

Written By Bhoomi
Published: Sep 26, 2026, 10:23 AM IST | Updated: Sep 26, 2026, 10:24 AM IST
Image Credit: Telangana High Court
Join

Telangana High Court: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ను ఏపీలో బీడీఎస్ పూర్తి చేసిన విద్యార్థికి తెలంగాణలో ఎండీఎస్ ప్రవేశాల్లో స్థానికత వర్తిస్తుందా లేదా అనే అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం.. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం అందించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ తో ఆంధ్రప్రదేశ్ లోని డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేసిన వరంగల్ విద్యార్థి వీ సాహిత్ ఎండీఎస్ కోర్సులో చేరేందుకు స్థానికత వర్తిస్తుందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో ఉన్న కోనసీమ డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేసిన తనకు తెలంగాణలో ఎండీఎస్ లో చేరేందుకు స్థానికత వర్తింపజేయడాన్ని సవాల్ చేస్తూ సాహిత్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామక్రిష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరలే ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే.. స్థానిక కోటా వర్తింపజేయాలంటూ 2024 డిసెంబర్ లో ఇదే హైకోర్టు తీర్పును వెలువరించినట్లు ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ పొందినంత మాత్రాన స్థానికత వర్తించదంటూ పేర్కొన్నారు. తర్వాత పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 2024లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 62లోని అంశాలను హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదన్నారు. అందువల్ల ప్రస్తుతం ఈ నిబంధనలను సవాలు చేస్తున్నామంటూ తెలిపారు. దీంతో ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ  నారాయణ వైద్య విశ్వవిద్యాలయాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES