SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Indiramma Sarees Distribution: 4.63 లక్షల మందికి కొత్త పెన్షన్లు.. ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసిన రేవంత్ సర్కార్!

Indiramma Sarees Distribution Date: తెలంగాణలో ఇందిరమ్మ చీరలు, కొత్త చేయూత పెన్షన్ల పంపిణీ వాయిదా పడింది. తొలుత ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రారంభించాలనుకున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం నవంబర్ 26కు మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలు అందించాలనేది లక్ష్యం. కొత్తగా మంజూరైన వారితో కలిపి 4,63,857 మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

Written By Harish Darla
Published: Nov 19, 2026, 10:08 IST | Updated: Nov 19, 2026, 10:19 IST
Join

Indiramma Sarees Distribution Date: తెలంగాణలో ఇందిరమ్మ చీరలు, కొత్తగా మంజూరైన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తాజా తేదీని ప్రకటించింది. ముందుగా నవంబర్ 19న ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, అనివార్య కారణాలతో వాయిదా వేశారు. తాజాగా మంత్రి సీతక్క వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26 నుంచి చీరల పంపిణీ, కొత్త పెన్షన్ల నగదు జమ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు గౌరవం, ఆత్మీయతను తెలియజేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ పంపిణీని చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చీరల పంపిణీకి సంబంధించి జిల్లాలు, స్థానిక అధికారుల స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారు. అయితే లబ్ధిదారులు ఎక్కడ, ఏ సమయంలో చీరలు తీసుకోవాలి, పంపిణీ కేంద్రాల వివరాలు ఏమిటి వంటి అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వచ్చే తాజా మార్గదర్శకాలను గమనించాలి.

మరోవైపు, చేయూత పథకం కింద కొత్తగా 4,63,857 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. వీరిలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు వంటి అర్హులైన వర్గాల వారు ఉన్నారు. నవంబర్ 26న ఈ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పలువురికి పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన నేపథ్యంలో, కొత్తగా ఎంపికైన వారు తమ బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ముందుగానే నిర్ధారించుకోవడం మంచిది

ఈ తేదీ మార్పుతో నవంబర్ 19న ప్రయోజనం అందుతుందని ఆశించిన మహిళలు, పెన్షన్‌దారులు మరో వారం రోజులు వేచి చూడాల్సి వస్తోంది. అయినప్పటికీ నవంబర్ 26 నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ఇచ్చిన తాజా ప్రకటనతో లబ్ధిదారుల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి.

ఇందిరమ్మ చీరల పంపిణీ లక్ష్యం కోటి మంది మహిళలు కాగా, కొత్త చేయూత పెన్షన్లకు ఎంపికైన వారు 4,63,857 మంది. ఈ రెండు కార్యక్రమాలూ నవంబర్ 26న ప్రారంభం కానున్నట్లు మంత్రి ప్రకటనలో స్పష్టమైంది. వ్యక్తిగతంగా పెన్షన్ మంజూరు అయిందా, ఖాతాలో డబ్బు జమైందా అనే వివరాల కోసం అధికారిక సమాచారం లేదా సంబంధిత శాఖ అధికారుల సూచనలనే అనుసరించాలి.

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES