SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IndiaJoy 2026 Hyderabad: ఇండియాజాయ్ 2026 డిసెంబర్ 7 నుంచి 13 వరకు.. ప్రపంచస్థాయి క్రియేటర్లకు హైదరాబాద్ వేదిక!

IndiaJoy 2026 Hyderabad Event Dates: తెలంగాణ రాష్ట్రంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసి, తెలంగాణ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ఇండియాజాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించింది. డిసెంబర్ 7 నుండి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ప్రతిష్ఠాత్మక 'ఇండియాజాయ్ 2026' సదస్సు సన్నాహక సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు హజరయ్యారు.

Written By Harish Darla
Published: Nov 18, 2026, 05:48 IST | Updated: Nov 18, 2026, 21:03 IST
Join

IndiaJoy 2026 Hyderabad Event Dates: హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో గ్లోబల్ ఏవీజీసీ, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తెలంగాణ ప్రభావాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించారు. సినిమా, వినోద పరిశ్రమల నుంచి భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పరిశ్రమకు ప్రభుత్వ తోడ్పాటు, అంతర్జాతీయ ప్రతినిధుల రాక, వ్యూహాత్మక ఒప్పందాలపై చర్చలు కేంద్రీకృతమయ్యాయి. ఈ సమావేశంలో ఇన్వెస్ట్ తెలంగాణ ఏవీజీసీ & ఆరెంజ్ ఎకానమీ డైరెక్టర్ వల్లభి ఎ., ఎస్‌టీపీఐ హైదరాబాద్ డైరెక్టర్ కవిత సి. సహా పలువురు ముఖ్య ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు.

ఇండస్ట్రీ నిపుణుల ప్రసంగాలు, క్రియేటివ్ షోకేస్..
ఈ కార్యక్రమంలో గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఎంఓ భరత్ లక్ష్మీపతి, ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ డైరెక్టర్ టొమాస్జ్ వాల్‌జాక్, అలాగే రోటోమేకర్ సీఈఓ, టీవీఏజీఏ జనరల్ సెక్రటరీ, ఇండియాజాయ్ కో-ఫౌండర్ మైక్ యథామ్ ప్రసంగిస్తూ యానిమేషన్ పరిశ్రమల మధ్య సహకారానికి గల అవకాశాలను వివరించారు.

ఇదే వేదికపై నిర్వహించిన 'తెలంగాణ ఏవీజీసీ క్రియేటివ్ షోకేస్' ద్వారా రాష్ట్రానికి చెందిన స్వదేశీ సృజనాత్మక, సాంకేతిక ప్రతిభను చాటారు. ఇందులో 1312 ఇంటరాక్టివ్ ఫౌండర్ దీపక్, పర్పుల్ టాక్ సీటీఓ వంశీ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ పాల్గొన్నారు.

'ఇన్వెస్ట్ తెలంగాణ' సమ్మిట్‌తో అనుసంధానం
ఇండియాజాయ్ 2026 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'లో భాగం కావడంతో ఏవీజీసీ రంగానికి సరికొత్త అధ్యాయం మొదలైంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఇన్వెస్టర్లతో సృజనాత్మక పరిశ్రమలు చేతులు కలపడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది.

డిసెంబర్ 7 నుండి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ ఏడు రోజుల అంతర్జాతీయ వేడుకకు ప్రపంచ స్థాయి క్రియేటర్లు, స్టూడియోలు, ఇన్వెస్టర్లు, నిపుణులు తరలిరానున్నారు. పరిశ్రమల మధ్య పరస్పర భాగస్వామ్యాల ద్వారా భారతీయ సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటి, హైదరాబాద్‌ను గ్లోబల్ ఏవీజీసీ కేంద్రంగా మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా మారింది.

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES