SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

RERA Penalty: తెలంగాణ రెరా సంచలన నిర్ణయం.. టాప్‌ నిర్మాణ సంస్థలకు భారీ జరిమానా!

Telangana RERA Imposes Penalty To Sanali IT Parks And Sri Aditya Squares: నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్మాణ సంస్థలకు తెలంగాణ రెరా సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కట్టడాలు ఉల్లంఘిస్తున్న నిర్మాణ సంస్థలకు భారీ ఎత్తున జరిమానా విధించింది. జరిమానా విధించిన సంస్థల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 17, 2026, 23:12 IST | Updated: Nov 17, 2026, 23:15 IST
Image Credit: Telangana RERA Penalty
Join

Telangana RERA Penalty: తెలంగాణలో భవన నిర్మాణాలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్మాణ సంస్థలకు రెరా భారీ షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లో బిల్డర్లపై కొరడా ఝుళిపించింది. ఒక బిల్డర్‌పై భవిష్యత్తు ప్రాజెక్టులకు నిషేధం విధించగా.. మరో సంస్థకు రూ.25 లక్షల జరిమానా విధించారు. బాధితుడికి రూ.26 లక్షలు వడ్డీతో సహా చెల్లించాలని మరో కంపెనీకి రెరా జరిమానా వేశారు. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకుంది.

నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటూ ఎనిమిది కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల కొనుగోలుదారులకు నగదు తిరిగి చెల్లించడంతో పాటు ఆలస్యమైన నిర్మాణాలకు వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు జరిమానాలు ఎదుర్కోవాలని రెరా ఆదేశాలు జారీ చేసింది. భువన్తేజా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌పై 'ఆరా' ప్రాజెక్టుతో పాటు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల్లోనూ యూనిట్ల విక్రయాలు, మార్కెటింగ్ చేయకుండా నిషేధం విధించింది. దీంతోపాటు బాధితుడికి రూ.26 లక్షలను 10.85 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని రెరా సంచలన ఆదేశాలు ఇచ్చింది. మంచిరేవులలో అనుమతులు లేని 'సనాలి ది ఎడ్జ్' ప్రాజెక్టును మార్కెటింగ్ చేయడంతో సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు రెరా రూ.25 లక్షల జరిమానా విధించింది.

జరిమానాలు ఇలా..
==> మియాపూర్‌లో ఫ్లాట్ కొనుగోలుదారుడికి ఇంటిని అప్పగించడంతోపాటు 10.85 శాతం వడ్డీ చెల్లించాలని ఆరైన్ ఇన్‌ఫ్రాకు ఆదేశాలు జారీ చేసింది. రూ.6.58 లక్షల బకాయిలు చెల్లించాలనే సంస్థ వాదనను తెలంగాణ రెరా తిరస్కరణ
==> తెల్లాపూర్‌లో అనుమతులు పొందకుండా నిర్మాణ పనులు ప్రారంభించని త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు రూ.41.85 లక్షలు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశం.
==> శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థ కొనుగోలుదారుడి నుంచి 15 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీ వసూలు చేయాలనే డిమాండ్‌ను తోసిపుచ్చింది. దీనికి రూ.17 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశం
==> నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లేకుండా చేపట్టిన టెక్ హోమ్స్ విల్లా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంలో విఫలమైన ఎస్వీఎం ఆదిత్య హోమ్స్ సంస్థకు రూ.27.16 లక్షలను 10.85 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి
==> మహేశ్వరం ప్రాంతంలో 184 చదరపు గజాల ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయడంలో విఫలమైన బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థకు రూ.7 లక్షలు వడ్డీతో సహా చెల్లించాలి
==> వాసవి లేక్ సిటీ ఈస్ట్ ప్రాజెక్టులో ఫ్లాట్ కోసం కొనుగోలుదారుడి నుంచి రూ.49.5 లక్షలు వసూలు చేసి నిర్ణీత సమయంలో ఫ్లాట్‌ను అప్పగించడంలో ఆలస్యం చేసిన వాసవి రియల్టర్స్ సంస్థ 10.85 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని ఆదేశం

భారీ హెచ్చరిక
ఈ జరిమానాలతో రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు ఉల్లంఘించే బిల్డర్లకు గట్టి హెచ్చరికలు పంపింది. కొనుగోలుదారుల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను ఈ నిర్ణయాల ద్వారా స్పష్టం చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES