SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రష్యా ఆర్మీలో చిక్కుకున్న నిజామాబాద్, కామారెడ్డి యువకులు!

Telangana Youth Trapped In Russia: రష్యాలో కొంతమంది నకిలీ ఏజెంట్ల మాయ మాటలకు నమ్మి.. నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లా సంబంధించిన నలుగురు ఆర్మీలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఇరుక్కుపోయారు.. వారిని ఎలాగైనా రక్షించాలని స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారా సెల్ఫీ వీడియోలు పంపారు..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 29, 2026, 03:59 PM IST | Updated: Sep 29, 2026, 04:01 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్‌..
Join

Telangana Youth Trapped In Russia News: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ యువకులు మోసపూరతి ఏజెంట్ల వలలో పడి తీవ్ర ప్రాణాపాయ స్థితిలె చిక్కుకున్నారు. మంచి జీతంతో పాటు సులవైన పని అని నమ్మించి.. రష్యా సైన్యంలో అనుకోకుండా చేర్పించడంతో వారు ప్రస్తుతం ఉక్రెయిన్ బార్డర్‌లో నరకం అనుభవిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాలకు చెందిన నలుగురు యువకులు రష్యా సైన్యంలో బందీలుగా మారి.. తమ ప్రాణాలు కాపాడాలంటూ.. పంపిన వీడియోలు ప్రస్తుతం వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.. తమ వారిని సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చేయాలని.. బాధిత కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కన్నీళ్లతో వేడుకుంటున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌కి సంబంధించిన భూక్యా రవీందర్, అశోక్‌తో పాటు మెగవత్ ప్రకాశ్.. అలాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్ ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ఆరు నెలల క్రితం ఒక్కొక్కరు ఏజెంట్‌కు రూ.3 లక్షల వరకు డబ్బులు కట్టి.. రష్యాలోని మాస్కో నగరానికి హెల్పర్ పనుల కోసం వెళ్లారట.. అయితే, వారు చేరిన కంపెనీలో ఆరు నెలలకే ప్రాజెక్ట్ పూర్తయిపోవడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడిపోయారట..

పనిలేక అనేక ఇబ్బంది పడుతున్న సమయంలో.. మిలిటరీ క్యాంప్‌లో గార్డెన్ క్లీనర్ పనికి నెలకు రూ.2 లక్షల జీతం అంటూ రాసి ఉన్న ఓ వాల్ పోస్టర్‌ను వారు గమనించారట... ఆ పోస్టర్‌లోని నంబర్‌కు ఫోన్ చేయగా.. అక్కడ ఉన్న ఏజెంట్ కూడా అది నిజమేనని చెప్పారట.. ఏజెంట్ మాటలు నమ్మిన ఆ నలుగురు యువకులు గార్డెన్ పనుల కోసమేనని భావించి మిలటరీ క్యాంప్‌కు చేరుకున్నారు.

అయితే, అక్కడ ఉన్న క్యాంప్‌కు చేరుకున్న తర్వాత అక్కడి అధికారులు వారిని ఓ మిలటరీ వాహనంలో ఎక్కించారట.. దాదాపు 12 గంటల పాటు సరైన తిండి.. నీళ్లు కూడా ఇవ్వకుండా ఒక అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ వారి చేతులకు అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి బలవంతంగా మిలిటరీ శిక్షణ మొదలు పెట్టారు.. మేము సైనికులుగా రాలేదు.. గార్డెన్ క్లీనర్ పనికి వచ్చాం.. ఈ ట్రైనింగ్ మా వల్ల కాదు.. అని యువకులు వారితో వాధించిన రష్యన్ ఆర్మీ అధికారులు కనికరించలేకపోయారట.. వారిని విచక్షణారహితంగా చితకబాదుతూ బలవంతంగా యుద్ధ శిక్షణ ఇచ్చారట.

ఈ శిక్షణ అయిపోయిన తర్వాత తమను ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ రంగంలోకి నెట్టేసే అవకాశాలు ఉన్నాయని.. అక్కడ ఏ క్షణంలోనైనా తాము చనిపోయే ప్రమాదం ఉందని బాధిత యువకులు స్వగ్రామాల్లోని కుటుంబ సభ్యులకు వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియో రికార్డింగ్‌లు పంపించారు. మమ్మల్ని ఎలాగైనా రక్షించండి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి అంటూ ఆ నలుగురు కన్నీరుమున్నీరవుతున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు సైతం బాధపడుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES