Nizamabad: ప్రభుత్వ స్కూల్‌లో దొంగల హల్‌చల్.. కంప్యూటర్లు వదిలేసి స్పోర్ట్స్ కిట్స్‌నే ఎత్తుకెళ్లారు!
Nizamabad News: ప్రభుత్వ స్కూల్‌లో దొంగలు హల్‌చల్ చేశారు. సెలవులను దృష్టిలో పెట్టుకుని స్టాఫ్ రూమ్‌లో ఉన్న స్పోర్ట్స్ కిట్స్‌ను దొంగలించారు. అంతేకాకుండా అక్కడున్న కంప్యూటర్లు, ఇతర వస్తులు దొంగతనం చేయలేకపోవడంతో.. ఎవరో తెలిసిన వారే ఈ దొంగతానికి పాల్పడి ఉంటారని స్కూల్ టీచర్స్ అభిప్రాయపడుతున్నారు.
Nizamabad Telugu News: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలోని ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలో దొంగలు హల్‌చల్ చేశారు. వరుసగా వచ్చిన మూడు రోజుల సెలవులను అనుకూలంగా మలచుకున్న గుర్తుతెలియని కొంత మంది పాఠశాల తాళాలు పగలగొట్టి సామాగ్రిని దోచుకెళ్లిన వింత ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది..
పాఠశాల ఆవరణలోని స్టాఫ్ రూమ్ తాళం పగులగొట్టి.. లోపలికి ప్రవేశించిన దొంగలు.. అక్కడున్న బీరువా తాళాలు పగలగొట్టి తెరిచారు.. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇటీవల కొత్తగా సరఫరా చేసిన స్పోర్ట్స్ కిట్స్‌తో పాటు ఆటలకు సంబంధించిన విలువైన వస్తులు మాత్రమే దొంగలించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అదే గదిలో విలువైన కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, ఇతర సాంకేతిక పరికరాలు ఉన్నప్పటికీ.. వాటిని ఏమాత్రం ముట్టుకోలేకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. కేవలం ఆట వస్తువులను మాత్రమే ఎత్తుకెళ్లడంతో.. పాఠశాల పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్న స్థానిక వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని ఉపాధ్యాయులతో పాటు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..
పాఠశాలలో కొన్ని రోజుల నుంచి ఆకతాయిలకు అడ్డాగా మారిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు రోజుల్లో.. రాత్రి వేళల్లో కొందరు తరగతి గదుల్లోకి అక్రమంగా ప్రవేశించి మద్యం సేవించడంతో పాటు ఖాళీ సీసాలను అక్కడే పడేయడం, మల విసర్జన చేయడం వంటి చేష్టలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు.. అంతేకాకుండా గుట్కాలతో పాటు పాన్ పరాగ్‌లు నమిలి గోడలు, గదుల్లో ఉమ్మివేస్తున్నారని వాపోయారు.
స్కూల్‌లో జరుగుతున్న ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై గతంలోనే రెండుసార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని HM తెలిపారు. పోలీసులు ముందస్తుగా స్పందించి.. రాత్రి పూట పెట్రోలింగ్ చేసి ఉంటే ఈ దొంగతనం జరిగేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జరిగిన చోరీ ఘటనపై ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు సమాచారం అందించి.. పోలీస్ స్టేషన్‌లో మరోసారి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..