Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్ మూడు రోజుల పాటు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. పోలీసుల కీలక ప్రకటన..
Traffic diversion in Hyderabad: పలు ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం వేళ ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆయా మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొవాలని సూచించారు.
Traffic restrictions several parts in Hyderabad: దుర్గా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ముగిశాయి. ఈ క్రమంలో పలుచోట్ల దుర్గమ్మ తల్లి విగ్రహాలను అంతే ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఈ రోజు దుర్గాదేవీ నిమజ్జనం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం రోజు ఉదయం 6 గంటల వరకు ఈ ట్రాఫిక్ నిబంధనల్ని అమలుచేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.
పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలు నిరంకారి జంక్షన్ వైపుకు మళ్లించారు. అదే విధంగా నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వచ్చే వాహనాలు పాత పీఎస్ సైఫాబాద్ వద్ద రవీంద్ర భారతి, మాసబ్‌ట్యాంక్ వైపును డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్బాల్ మినార్ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వైపునకు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ బడా గణేష్ లేన్, మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ ను అనుమతించ బొమని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వద్ద మింట్ కాంపౌండ్, రాజీవ్ గాంధీ విగ్రహం వైపు వాహనాలు డైవర్ట్ చేస్తారు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద లిబర్టీ వైపునకు మళ్లిస్తారు.
ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజలు ఈ ట్రాఫిక్ మళ్లింపులను పాటిస్తు తమ జర్నీలను ప్లాన్ చేసుకొవాలని పోలీసులు పలు సూచనలు చేశారు. ఇటీవల హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తరచుగా రోడ్డు ప్రమాదాలుజరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ నిబంధనల్ని తప్పకుండా పాటించాలని పోలీసులు కోరుతున్నారు. ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో వెళ్లడం, తాగి వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలుంటాయని చెబుతున్నారు.