కొల్లాపూర్ చెరువులో చేపల వలలో చిక్కిన రెండు భారీ కొండచిలువలు!
Kollapur Huge Pythons News: కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని చుక్కాయిపల్లి చెరువులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మత్స్యకారులు చేపల కోసం వలన విసిరగా రెండు భారీ కొండచిలువల చిక్కాయి. అందులోని ఒక కొండచిలువ వల నుంచి తప్పించుకొని చెరువులోకి వెళ్లిపోయింది. మరో కొండచిలువ వలలోనే చిక్కుకొని ఉండిపోయింది. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది..
Kollapur Huge Pythons News: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేదు అనుభవం ఎదురయింది. చేపల కోసం విసిరిన వాళ్లకు భారీ కొండచిలువ చిక్కుకుపోవడంతో మత్స్యకారులంతా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చుక్కాయిపల్లి చెరువులో దగ్గర చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా మత్స్యకారులు అది పెద్ద చేప అనుకున్నప్పటికీ.. దగ్గరికి లాగి చూడగా.. అత్యంత ప్రమాదకరమైన భారీ కొండచిలువని గమనించారు. అయితే ఈ కొండచిలువను ఏం చేశారు? అది అక్కడికి ఎలా వచ్చింది దానికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్థానికంగా ఉన్న మత్స్యకారులు రోజులాగే చేపల వేట కోసం చుక్కాయిపల్లి చెరువులోకి దిగి వలలు విసిరారు. కొంత సమయం తర్వాత బరువుగా అనిపించిన వలను ఒడ్డుకు లాగి చూడగా.. అందులో రెండు భారీ కొండచిలువలు ఉండటాన్ని గమనించి తీవ్రభయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, వలను బయటకు తీసే క్రమంలో ఒక కొండచిలువ వల నుంచి నేరుగా తప్పించుకొని తిరిగి చెరువులోకి జారుకుంది. మరో భారీ కొండచిలువ మాత్రమే వలలో చిక్కుకు పోయింది..
Also Read: అయ్యో.. కృష్ణజింకను అమాంతం మింగేస్తున్న భారీ కొండచిలువ.. వీడియో!
చుక్కాయిపల్లి చెరువు కట్టపై ప్రతిరోజు ఉదయం.. సాయంత్రం వేళల్లో స్థానిక మహిళలతో పాటు వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వాకింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ ఘటనతో వాకర్లు తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం. చెరువులో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు సైతం నీటిలో దిగాలంటే వణికిపోతున్నారట.. తప్పించుకొని రెండో కొండచిలువ ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో అని స్థానికుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ఈ ఘటనపై కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ వాణి కుమారి స్పందిస్తూ పలు కీలకమైన సూచనలు కూడా చేశారు.. ముఖ్యంగా చెరువు పరిసరాల్లో చేపలు పట్టే మధ్యకారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.. అంతేకాకుండా నివాస ప్రాంతాల్లో గాని చెరువు, బహిరంగ ప్రదేశాల్లో కొండచిలువలు, ఇతర వన్యప్రాణులు కనిపిస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కొట్టి చంపకూడదు అన్నారు. వన్యప్రాణులు కనపడితే తప్పకుండా స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..