Bandi Sanjay: ఓటు, సీటు చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్‌కే.!.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi sanjay fires on congress: ఇండియా కూటమి ఢిల్లీలో చేపట్టిన నిరసనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. దేశమంతా నవ్వుకుటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బారెకెడ్లు ఎక్కి ఆ నిరసనలు ఏంటని మండిపడ్డారు.
Bandi Sanjay fires on congress party over ec sir row in delhi: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సర్ ప్రక్రియ, ఓట్ చోరీ అంశం పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే ఇండియా కూటమి ప్రధాని మోదీకి, ఎన్నికల సంఘంపై నిరసనలు చేపట్టిన తీవ్రమైన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ అట్టుడికిపోతుంది.
మరోవైపు నిన్నటి నిరసనల్లో రాహుల్ గాంధీ బారికెడ్లను ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. తాజాగా ఈ నిరసనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంను కొనియాడారు.
అదే విధంగా.. 25 ఏళ్ల సుదీర్ఘ, నిస్వార్థ ప్రజాసేవను పురస్కరించుకుని.. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
దేశంలో ఓట్ చోరీ, సీట్ చోరీ పేటెంట్స్ రైట్స్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఓట్, సీట్ చోరీ చేయాల్సిన అవసరం కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాని మోదీకి లేవన్నారు. నిన్న రాహుల్ గాంధీ చేసిన నిరసనలపై సెటైర్లు వేశారు. ఒక కాంగ్రెస్ అగ్రనేత ఈ విధంగా బారికెడ్లు ఎక్కడం ఏంటని సెటైర్లు వేశారు.
సీఈసీ రాజ్యంగ బద్ద సంస్థ అని, బీజేపీ సంస్ధ కాదని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటే.. కోర్టులో పిటిషన్ వేశారని న్యాయస్థానం ఆదేశిస్తే అలానే జరుగుతుందని చెప్పారు. సీఈసీ కార్యలయంకు వందల మంది వస్తామంటూ ఊరుకుంటారా..?.. మీ ఏఐసీసీ భవన్ కు ఇదే విధంగా వందల మంది వస్తే ఊరుకుంటారా..?.. అంటూ సెటైర్లు వేశారు. అయితే.. 1946 లో పీసీసీలన్ని సర్దార్ పటేల్ ప్రధాని కావాలని ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్ మాత్రం నెహ్రుని ప్రధాని చేసి ఓటు, సీటు చోరీ చేసిందన్నారు.
ఓట్ సీట్ చోరీ చేయాల్సిన అవసరం ప్రధాని మోదీకిలేదన్నారు. ఆయనకు అసలు కుటుంబమేలేదన్నారు. బ్యాంకు బ్యాలెన్స్ లు, బినామీ ఆస్తులు, వారసత్వ రాజకీయాలు మోదీకి లేవన్నారు. అంతే కాకుండా.. 2047 లో వికసిత్ భారత్ టార్గెట్ గా ప్రధాని మోదీ నిర్విరామంగా పనిచేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
పదవుల కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదని పార్టీ ఏ బాధ్యతలు అప్పగించిన కూడా బాధ్యతతో నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని అన్నారు. అందుకే బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్, కాంగ్రెస్ ఆరుగ్యారంటీల మోసాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించడంలేదన్నారు.