SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Yadadri Temple: యాదగిరిగుట్ట బస్టాండ్ లో నాగు పాము కలకలం.. ప్రయాణికులు పరుగో పరుగు.!. చివరకు ఏంజరిగిందంటే..?..

Snake in yadadri temple busstop: కొండపై ఉన్న బస్టాండ్ లో పాము కన్పించడంతో భక్తులు పరుగులు పెట్టారు. వెంటనే స్నేక్ సొసైటీ వ్యక్తిని రప్పించారు. ఆ పామును జాగ్రత్తగా పట్టించి అడవిలో తీసుకెళ్లి వదిలేశారు.

Written By Inamdar Paresh
Published: Nov 12, 2026, 05:46 PM IST | Updated: Nov 12, 2026, 05:54 PM IST
Image Credit: snake spotted in yadadri temple bus stop (file)
Join

Venomous Snake spotted in bus stand near Yadadri temple hills: పాములు ఎక్కువగా అడవులు, కొండ ప్రాంతాల్లో ఉంటాయి.మరీ ఇటీవల వాటికి సరైన ఆహరం దొరక్కనొ లేదా మారిన వాతావరణ ప్రభావమో కానీ అవి ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. కోబ్రాలు ఎక్కువగా చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఉంటున్నాయి. బెడ్ లు, షూస్ లు, దట్టమైన చెట్లు, పొదల్లో మాటు వేసుకుని దాక్కుంటున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా కోబ్రా కాటుకు గురికావాల్సిందే. అందుకే పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలోని బస్టాండ్ లో నాగు పాము ప్రత్యక్షమైంది. దీంతో అక్కడున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

 

 


యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి గుట్ట పైన ఉన్న బస్టాండ్ లో నాగు పాము కన్పించింది. మెట్లపై పాము అటు ఇటు పాక్కుంటూ తిరగడంను కొంతమంది ప్రయాణికులు గుర్తించారు. వెంటనే భయంతో దూరంగా పారిపోయారు దీంతో అక్కడ గందరగోళ వాతావరణం తలెత్తింది. పాపం.. నాగు పాము ప్రయాణికుల అరుపులతో బెదిరిపోయి చుట్టుకుని ఎటు కదలకుండా ఒక మూలన ఉండిపోయింది. వెంటనే అక్కడున్న ఆలయ సిబ్బంది స్నేక్ టీమ్ ను రప్పించారు. 

ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తి ఎంతో చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత దగ్గరలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. పెద్ద ప్రమాదం తప్పడంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు కార్తీక మాసం నేపథ్యంలో యాదాద్రి  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పొటెత్తారు. ఆలయ కమిటీ సైతం భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES