మైనర్ బాలికలను ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్? ఈ ఘటనలో పోలీసులపై సంచలన ఆరోపణలు!
Vikarabad Minor Abuse Allegations: దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఇప్పుడు పోలీసు అధికారులపై ఆరోపణలు వచ్చేలా చేస్తోంది. ఈ మైనర్లపై లైంగిక వేధింపుల్లో భాగంగా పోలీసులు ఎందుకిలా పట్టి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసలు నిందితులపై ఇంకా కేసు పెట్టకపోవడానికి కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vikarabad Minor Abuse Allegations Telugu: తెలంగాణాలోని వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికలపై జరిగిన అఘాయిత్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో ఒక బాలికను వలలో వేసుకుని.. ఆపై మరికొందరు మైనర్లను బ్లాక్‌మెయిల్ చేస్తూ సాగించిన కొన్ని వికృత చేష్టలు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే.. సెటిల్మెంట్‌కు తెరలేపుతురన్న ఆలోచనలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రేమ పేరుతో ఉచ్చు..
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. నలుగురు కామాంధులు తొలుత ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి.. ఆపై ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను మొబైల్‌లో రికార్డ్ చేసి.. ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారట.. ఆ వీడియోలను సోషల్ మీడియాల్లో పెడతామని బెదిరిస్తూ.. ఆమె ద్వారానే మరికొంతమంది అమాయక మైనర్ బాలికలను కూడా తమ వలలోకి వేసుకున్నట్లు తెలుస్తోంది.. ఇటీవలే వీరి వికృత చేష్టాలకు సంబంధించిన ఒక వీడియో బయటికి రావడంతో ఈ దారుణ బాగోతం వెలుగు చూసింది.
మైనర్లపై లైంగిక వేధింపులతో పాటు బెదిరింపులకు పాల్పడినప్పుడు POCSO చట్టం కింద పోలీసులు తప్పకుండా కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ దోమ పోలీస్ స్టేషన్‌లో అందుకు విరుద్దంగా వ్యవహరించారనే ఆరోపణలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక SI.. నిందితులైన నలుగురు యువకులను స్టేషన్‌కు పిలిపించి.. కేవలం చితకబాది వదిలేసిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారి దగ్గరి నుంచి మొబైల్స్ తీసుకుని.. వీడియోలు డిలీచ్ చేయించి.. ఓ స్థానిక నేత సమక్షంలో రాజీ పంచాయితీ పెట్టి కేసును తొక్కి పెట్టారనే విమర్శలు మెండుగా విపిస్తున్నాయి.
ఈ ఘటన జరిగి దాదాపు వారం రోజులు అవుతున్న పోలీసులు బాహ్య ప్రపంచానికి ఏమీ తెలియనట్లు మౌనం వహించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు సైతం చర్చించుకుంటున్నారు. మైనర్ల పరువుతో పాటు భవిష్యత్తును సాకుగా చూపి బాధితుల కుటుంబాలను మాట్లాడకుండా.. కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఊహించని స్థాయిలో వినిపిస్తున్నాయి.. రక్షించాల్సిన పోలీసులే.. అన్యాయానికి అడ్డాగా మారరా అని స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..