Rajagopal Reddy: సీఎం రేవంత్ టార్గెట్‌గా వ్యాఖ్యలు.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఫోన్ కాల్.!.
Congress high command on cm revanth reddy: రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటికే తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో కొత్త తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీతో భేటీ అవ్వాలని ఆయనకు పీసీసీ కాల్ చేసింది. దీంతో మరోసారి మునుగోడు ఎమ్మెల్యే అంశం హాట్ టాపిక్ గా మారింది.
Congress High Command Calls Munugude mla rajgopal reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మనుగోడు ఎమ్మెల్యే అంశంపై రాజకీయంగా దుమారంగా మారింది. సొంతపార్టీ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అపోసిషన్ పార్టీల నేతల కన్నాఎక్కువగా విమర్శాణాస్త్రాల్ని సంధిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ మాటల యుద్దం కాస్త పీక్స్ కు చేరింది. అయ్యప్ప మాలలో కూడా ఉన్నాకూడా సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి పదునైన విమర్శల్ని ఎక్కుపెట్టారు. ఇటీవల సీఎం రేవంత్ భాషపై, తన నియోజక వర్గంకు నిధులు కేటాయింపు చేయకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం సీఎం, మంత్రుల నియోజక వర్గాలకు నిధుల్ని కేటాయించడం, ఇతర నియోజక వర్గాల్ని నిధుల్ని కేటాయించక పోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని రెచ్చిపొవద్దని ఎక్స్ వేదికగా ఏకీపారేశారు.
మూడేళ్లు ప్రజలకు ఇచ్చిన హమీల్ని నెరవేర్చకుండా మోసం చేశారని చివరి రెండెళ్లయిన సరైన పాలన అందించాలన్నారు. నిధులు అడిగితే పండపెట్టి తొక్కుతా అనడం ఏంటనిఫైర్ అయ్యారు. మరోవైపు సీఎం సైతం కొంత మంది నేతలు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి అంశంపై ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
డిసిప్లినరీ కమిటీ అన్ని గమనిస్తుందన్నారు. తమకు అందరు నేతలు సమానమే అంటూ తెల్చి చెప్పారు. తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కర్ణాటకకు చెందిన బీఎం సందీప్ తెలంగాణకు నూతన కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీగా నియమితులైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ రాజగోపాల్ రెడ్డి వివాదంను బీఎం సందీప్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బీఎం సందీప్ ను 23న కలవాలంటూ రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి AICC కార్యదర్శి సచిత్ సావంత్ సూచించారు.
నవంబర్ 23వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జి బీఎం సందీప్ తో రాజగోపాల్ రెడ్డి సమావేశం జరుగనుంది. మరోవైపు ఇటీవల ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల నేపథ్యంలో మంత్రి పదవి దాదాపుగా ఆయనకు దక్కదని రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఏవిధంగా చర్యలు తీసుకుంటుందో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.