SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దానం ఎన్నిక చెల్లదంటూ PJR కుమార్తె విజయారెడ్డి పిటిషన్.. నోటీసులు జారీ..

Vijaya Reddy Sensational Comments On Danam Nagender: ఖైరతాబాద్ అసెంబ్లీ ఎన్నికల వివాదంలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం ఎదురైంది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దివంగత నేత పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 21, 2026, 07:32 IST | Updated: Nov 21, 2026, 08:36 IST
Image Credit: Danam Nagender Vs Vijaya Reddy High Court (Source/ZEE News Telugu)
Join

High Court Notice: దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌లో హైకోర్టు  దానంతో పాటు ఈ కేసులోని ఇతర ప్రతివాదులందరికీ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో దానం నాగేందర్ తన ఆస్తులు, ఇతర కీలక వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపిస్తూ విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

అఫిడవిట్‌లో దానం ఆస్తులు, ఇతర కీలక వివరాలను దాచారన్న విజయారెడ్డి..
నిబంధనలకు విరుద్ధంగా అఫిడవిట్ దాఖలు చేసినందున ఆయన ఎన్నికను రద్దు చేసి, ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. శుక్రవారం ఈ పిటిషన్‌తో పాటు సంబంధిత అనుబంధ దరఖాస్తులపై విచారణ జరిపిన ధర్మాసనం, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది.

విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా..

అనంతరం దానం నాగేందర్‌తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రతివాదులందరి వాదనలు పూర్తిగా విన్న తర్వాతే ఈ పిటిషన్‌పై తుది నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పటికే దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ కోర్టు తేల్చిచెప్పింది. ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ లోక్‌సభకు పోటీ చేయడంతో ఆయన ఎన్నిక చెల్లదంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పీజేఆర్ కుమార్తె ఇపుడు హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ఆసక్తి రేకిస్తోంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES