DGP CV Anand: నిరుద్యోగులకు బంపర్ శుభవార్త.. తెలంగాణ పోలీస్ శాఖలో 2 వేల పోస్టుల భర్తీ.. డీజీపీ కీలక ప్రకటన..
Dgp cv anand on on police jobs: తెలంగాణలో పోలీసు శాఖలో మరల పోస్ట్ ల భర్తీకి డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Dgp cv anand good news to Telangana unemployed youth: తెలంగాణలో ప్రస్తుతం కొన్ని రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు పోలీస్ జాబ్ ల కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. అంతే కాకుండా ఒకవైపు కోచింగ్ లు తీసుకుంటూ,మరోవైపు రూమ్ లలో ఉంటూ రేయింబవళ్లు సర్కారు కొలువు టార్గెట్ గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారు. దీనికోసం ఎంతటి త్యాగాలైన చేస్తున్నారు. కొంత మంది రీడింగ్ రూమ్ లలో ప్రిపేర్అయితే, మరికొంతమంది సెంట్రల్ లైబ్రరీలకు వెళ్లి మరీ ప్రిపేర్ సర్కారు జాబ్ ల కోసం అవుతున్నారు.
ఇప్పటికే పోలీస్ నియామక మండలి పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్ట్ లకు 7,112 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో సివిల్, ఏఆర్, పోలీస్ కానిస్టేబుల్, సీఆర్పీఎఫ్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్ట్ లు ఉన్నాయి. మరోవైపు 275 ఎస్సై పోస్టులకు గాను ఈనెల 29న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. దీనికి పోలీసు నియామక మండలి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
నవంబర్ 22 ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 28 రాత్రి 12 గంటల వరకు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారు.
ఈక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు జాబ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2వేల హోంగార్డు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టులపై పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ ను తొందరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.