SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ..

Khairatabad By Poll: ఖైరతాబాద్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఈ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్లు ఇటీవల శాసనసభ కార్యదర్శి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 10:20 AM IST | Updated: Oct 01, 2026, 10:25 AM IST
Image Credit: Khairatabad By Poll (ZEE News Telugu/Source)
Join

Khairatabad By Poll 2026: ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా దానం .. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీ తరుపున బీ ఫారంతో ఎన్నికల్లో పోటీ చేయడం అనైతికం కాబట్టి ఆయన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్ధించింది. దీంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఊడిపోయింది.

ఇక త్వరలో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా ఎక్కడైనా నియోజకవర్గం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఖైరతాబాద్‌ విషయంలో తలెత్తిన పరిణామాలతో ఇది సాంకేతికంగా రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్నట్లు తాజాగా ఈసీ ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్‌ తేల్చింది. కాంగ్రెస్ బీ ఫారం నుంచి దానం నాగేందర్ ఎపుడైతే పోటీ చేసాడో అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉన్నట్టుగా గెజిట్‌లో ఉంది.

ఈ  నేపథ్యంలో ఖైరతాబాద్‌లో  వెంటనే ఉప ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వాటితో పాటే ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక జరపాలా? లేక ముందే నిర్వహించాలా.. అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం.

సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)‌ అనంతరం తుది ఓటర్ల జాబితాను నవంబరు 9న ప్రకటిస్తారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించే వరకు ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు వెళ్లే పరిస్థితులు లేవు. ఏది ఏమైనా ఖైరతాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అటు అధికార కాంగ్రెస్.. ఈ స్థానంలో పాగా వేయాలనే ప్లాన్‌లో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఈ స్థానంలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ది చెప్పాలన్నట్టు ఫిక్స్ అయింది. మరోవైపు బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన రాబోయే సాధారణ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES