SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: సీరియళ్లలో చాన్స్‌ల పేరిట యువతిపై పాడుపని..హైదరాబాద్‌లో వెలుగులోకి మరో ఘోరం.!.

Girl cheated in Hyderabad: సీరియళ్లలో చాన్స్ లు ఇప్పిస్తానని చెప్పి యువతికి మాయమాటలు చెప్పాడు.ఆ తర్వాత ఆమె నగ్నవీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. చివరకు మోసపోయినట్లు గ్రహించిన యువతి బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది.

Written By Inamdar Paresh
Published: Nov 15, 2026, 18:48 IST | Updated: Nov 15, 2026, 19:14 IST
Image Credit: Hyderabadcrime(file)
Join

Girl cheated by a man in hyderabad: ఇటీవల సమాజంలో మహిళల్ని టార్గెట్ చేసుకుని కొంత మంది కామాంధులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ల అవసరాలు, బలహీనతల్ని ఆసరాగా చేసుకుని దారుణాలు చేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ లో చాన్స్ లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి హైదరాబాద్ కు రప్పిస్తున్నారు. ఆ తర్వాత వారికి మాయమాటలు చెప్పి షూటింగ్ ల పేరిట కొన్ని రోజులు టైంపాస్ చేస్తున్నారు. ఆ తర్వాత తమఅసలైన రంగును బైటపెడుతున్నారు. ఇలాంటి వారి ట్రాప్ లో పడి మోసపోతున్న మహిళల ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. వీరిలో చదువుకున్న వారు కూడా ఉండటం ఒకింత ఆందోళనల కల్గించే అంశంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో తాజాగా.. దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో ఒక యువతి తనను సీరియళ్లలో చాన్స్ ల పేరిట ఒక వ్యక్తి మోసం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక యువతికి టీవీ సీరియళ్లలో అవకాశాలు ఇప్పిస్తానని, యూట్యూబ్ లో రీల్స్ తో భారీగా డబ్బులు సంపాదించవచ్చని బోరగడ్డ కాళిదాస్ అనే వ్యక్తి ట్రాప్ చేశాడు. అతడి మాయమాటలు నమ్మిన యువతి అతను చెప్పిన విధంగా చేసింది. 

దీన్ని ఆసరాగాచేసుకున్న అతగాడు.. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోల్ని, వీడియోల్ని తీసుకున్నాడు. ఆతర్వాత దాన్ని చూపిస్తు బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు.  తాను చెప్పినట్లు వినాలని లేకుండా నగ్న ఫోటొల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆమెను బెదిరించాడు. 

అతగాడి వేధింపులు తాళలేక యువతి పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు ఇలాంటి బెదిరింపు ఎదుర్కొంటున్న బాధితులు అప్రమత్తంగా ఉండాలని, చాట్స్ లు, వాయిస్ కాల్స్, బెదిరింపుల కాల్స్ లను రికార్డు చేసుకుని పోలీసుల్ని ఆశ్రయించాలని సూచించారు. ఈ ఘటనతో మరోసారి హైదరాబాద్ లో మహిళల భద్రతపై ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES