SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పేరులోనే A1.. పనుల్లో మాత్రం గ్రేడ్-1 రోత.. నకిలీ వెల్లుల్లి గుట్టురట్టు..!

Hyderabad News: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టును కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు, ఆహార భద్రతా అధికారులు రట్టు చేశారు. ఏ1 అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై సంయుక్తంగా దాడులు నిర్వహించిన అధికారులు.. తీవ్ర అపరిశుభ్ర వాతావరణంలో, నాసిరకమైన కుళ్లిన ముడిసరుకుతో పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 23, 2026, 05:00 PM IST | Updated: Oct 23, 2026, 05:02 PM IST
Image Credit: Hyderabad News
Join

Hyderabad News: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్వెళ్లి ప్రాంతంలో ఉన్న ఏ1 అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు, ఆహార భద్రతా అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేస్ట్ తయారీకి సంబంధించిన నాణ్యతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు, నాసిరకమైన ముడిసరుకును వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు నిత్యం వంటల్లో వినియోగించే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు అత్యంత కీలకం. అయితే అత్వెళ్లిలోని ఏ1 తయారీ కేంద్రంలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా పేస్ట్ తయారీ విధానంపై అధికారులు పరిశీలన చేపట్టినట్లు తెలిసింది. ఆహార పదార్థాల తయారీలో తప్పనిసరిగా పాటించాల్సిన ప్రమాణాల విషయంలో లోపాలను అధికారులు గుర్తించి చర్యలకు చర్యలు తీసుకున్నారు.

తనిఖీల్లో భాగంగా కల్తీ అల్లం పేస్ట్‌ను.. అలాగే నాణ్యతలేని అల్లం వెల్లుల్లిని అధికారులు సీజ్ చేశారు. ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో తయారీ కేంద్రం నిర్వాహకుడు అలిమ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్న ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ సంయుక్త దాడుల్లో ఆహార భద్రతా అధికారి అమృత శ్రీ, కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ ఎస్సై రాజేష్‌తో పాటు పోలీసు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. తయారీ కేంద్రంలో గుర్తించిన లోపాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

ప్రజలు రోజువారీ ఆహార తయారీలో వినియోగించే అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి అక్రమ తయారీ కేంద్రాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. పేస్ట్ నిల్వలు, విక్రయాలు, ఇప్పటికే మార్కెట్‌లోకి సరఫరా చేసిన ఉత్పత్తుల వివరాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ పెంచడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలను చేపట్టాలని అంటున్నారు.

స్వీట్ షాపుల్లో విస్తృత తనిఖీలు..

టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా స్వీట్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 12 ప్రత్యేక బృందాలతో మిఠాయి దుకాణాలపై అధికారుల మెరుపు దాడులు చేశారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్ల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన మిఠాయిలు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండా.. కాలం చెల్లిన లైసెన్సులతో నడుస్తున్న షాపుల గుర్తించారు. కూకట్‌పల్లి KPHB లోని వాసిరెడ్డి స్వాగృహ ఫుడ్స్‌కు, జలపల్లిలోని జె ఫుడ్స్ సంస్థకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో దొరికిన కాలం చెల్లిన స్వీట్లను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES