• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Elections: రంగంలోకి డీఐజీ ప్రవీణ్‌.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు

AP Elections: రంగంలోకి డీఐజీ ప్రవీణ్‌.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు

DIG Koya Praveen Review Local Body Elections: ఏపీలో స్థానిక సమరం తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ రంగంలోకి దిగారు. స్థానిక ఎన్నికల్లో సమస్యాత్మకంగా మారిన ప్రాంతాలను సందర్శించి.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్‌ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 23, 2026, 06:37 PM IST|Updated: Oct 23, 2026, 06:42 PM IST
joinshare
AP Elections: రంగంలోకి డీఐజీ ప్రవీణ్‌.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు
Image Credit: AP Politics

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tummidihatti Project: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన.. త్వరలోనే మహారాష్ట్రతో చర్చలు

Tummidihatti Project: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన.. త్వరలోనే మహారాష్ట్రతో చర్చలు

2

AP Elections: రంగంలోకి డీఐజీ ప్రవీణ్‌.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు

3

Samantha Ruth Prabhu: సమంత లక్కీ ఛార్మ్ ఆ హీరోనే.. ఆయనంటే చాలా ఇష్టంట!

4

పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్.. కార్గిల్ యుద్ధంలో సొంత సైనికుల శవాలనే తీసుకోలేదంటూ ఫైర్..!

5

Allu Arjun: బన్నీ ట్వీట్.. రజినీకాంత్‌పై ప్రశంసలు.. మెగా ఫ్యాన్స్‌తో మరో వివాదం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Police: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం.. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ రంగంలోకి దిగారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసు బందోబస్తు, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. బి. కొత్తకోట ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నామినేషన్ల చివరి రోజు కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నామినేషన్ కేంద్రం చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించి పోలీసు బందోబస్తు, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని.. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అన్నమయ్య జిల్లా పుంగనూరు ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'కర్నూల్, నంద్యాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నామినేషన్స్ జరుగుతున్నాయి. 2021 ఎన్నికల్లో పుంగనూరులో ఎలా జరిగాయో నాకన్నా మీకే బాగా  తెలుసు. పోటీ అనేది తీవ్రంగా ఉంది. ఒకరు ముందుకొచ్చి ప్రతిఘటిస్తే అవతల వారు కూడా ప్రతిఘటిస్తారు. మొత్తానికి పరిస్థితి అదుపులో ఉంది' అని తెలిపారు.

'తంబలపల్లిలో చెదురు ముదురు ఘటనలు జరిగాయి. పుంగనూరు ప్రశాంతంగా ఉంది. ఏడాది కిందట వచ్చిన ఎస్పీకి, గోదావరి నుంచి వచ్చిన నాకు ఇక్కడ క్రిమినల్స్ ఎవరనేది తెలియదు. కడపలో ఉన్నంత ప్రభావంతంగా చిత్తూరు జిల్లాలో ఉన్న పోలీసులు లేరు. అధికారులు బాధ్యత తీసుకుంటున్నారు. కింద సిబ్బంది బాధ్యత రహితంగా లేరు. ఇక్కడ వారు ఎక్కువ మంది కర్ణాటక, తిరుపతిలో ఉన్నారు. వారిని గుర్తించడం చాలా కష్టం. ఆరు నెలల నుండి ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్ పుంగనూరులో లేకపోవడంతో ప్రశాంతంగా ఉంది. ఎన్నికల సమయంలో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తాం' అని డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Elections
Andhra Pradesh
Politics
AP News