Indigo Flight: విమానంలో పవర్ బ్యాంక్ పేలి మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం
Power Bank Blast Indigo Flight Meet In Fire At Shamshabad Airport: ఆకాశంలో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హాహాకారాలు మొదలుపెట్టారు. వెంటనే విమానం అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి.
Shamshabad Airport: విమానంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ప్రయాణికుల హాహాకారాలు చూసి వెంటనే పైలెట్, విమాన సిబ్బంది అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని దింపారు. ఏం జరిగిందో తెలియక భయాందోళన చెందగా.. తీరా పవర్ బ్యాంక్ పేలి మంటలు వ్యాపించాయని ఊపిరి పీల్చుకున్నారు. మంటలను వెంటనే ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం 6ఈ6115 బయల్దేరి చెన్నైకి ప్రయాణం చేస్తోంది. ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమై ఎయిర్ క్రాఫ్ట్‌లోని ఫైర్ సేఫ్టీ చర్యలతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదం కారణంగా చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని హైదరాబాద్‌కు దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ లాండింగ్ అయిన విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు.
లిథియం బ్యాటరీ పవర్ బ్యాంక్ పేలి విమానంలో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పవర్ బ్యాంక్ ప్రమాదంపై అధికారులు ఆరాతీస్తున్నారు. పవర్ బ్యాంక్ ఎలా మంటలు చెలిరేగాయి? ఏ కంపెనీకి చెందిందనే కోణంలో విచారణ చేపట్టారు.