Secunderabad: రన్నింగ్ ట్రైన్ నుంచి జారీపడ్డ ప్రయాణికుడు.. ఆర్పీఎఫ్ పోలీసుల సమయస్ఫూర్తికి నెట్టింట ప్రశంసలు.. వీడియో వైరల్..
Man falls from running train in Secunderabad: కదులుతున్న రైలు ఎక్కుతూ చంద్రయ్య అనే ప్రయాణికుడు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. దీంతో ప్లాట్ ఫామ్ మీద ఉన్న వారు షాక్ కు గురయ్యారు. కానీ రైల్వే పోలీస్ మాత్రం ఎంతో చాకచక్యంగా ప్రవర్తించాడు. సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వైరల్ గా మారింది.
Man falls from running train in secunderabad: సాధారణంగా చాలా మంది ఎక్కువగా రైళ్లలో జర్నీలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ఈ క్రమంలో కొంత మంది రైళ్లలో ప్రయాణాలు చేసేటప్పుడు నెగ్లీజెన్సీగా ఉంటారు. రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నించడం లేదా రైలు స్పీడ్ గా వెళ్తున్నప్పుడు దిగేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో అనుకొని ఘటనలను చోటుచేసుకుంటాయి. చాలా సార్లు రైల్వే పోలీసులు, ప్లాట్ ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు అప్రమత్తంగా ప్రవర్తించడం వల్ల ప్రయాణికులు ప్రమాదాల బారి నుంచి బైటపడిన ఘటనలు కొకొల్లలు.ఈ క్రమంలో తాజాగా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి ఒక వ్యక్తి రైలుకు,ప్లాట్ ఫామ్ మధ్యన ఇరుక్కున్నాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే రైలు స్పీడ్ గా వెళ్తుంది. ఎలాగైన రైలుఎక్కాలని పరిగెత్తాడు. కానీ ఇంతలో అతను రైలునుంచి జారీపోయి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోయాడు. దీంతో అక్కడి వారు షాక్ అయ్యారు.
కానీ అక్కడే విధుల్లో ఉన్న రైల్వే పోలీస్ ఎంతో చాకచక్యంగా ప్రవర్తించి వెంటనే ఆ ప్రయాణికుడ్ని బైటకు లాగాడు. ఈ ఘటనతో ప్లాట్ ఫామ్ మీద ఉన్న వారంతా గందర గోళంకు గురయ్యారు. ప్రయాణికుడి బైటకు లాగడంతో అతను పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాడు. అక్కడున్న వారంతా ఆర్పీఎఫ్ పోలీసు సమయస్పూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధితుడు సైతం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు సైతం ఆర్పీఎఫ్ సమయస్పూర్తికి ఫిదా అవుతున్నారు.