SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆత్మ రక్షణ కోసం హిందువులు గన్స్ చేత పట్టండి.. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు..

Raja Singh Comments: బీజేపీ బహిష్కృత నేత గోషా మహల్ ఎమ్మెల్యే ఠాకూర్ రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువుల మనుగడ కష్టతరవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరో వచ్చి మిమ్మల్ని రక్షిస్తారని కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి తుపాకీలు చేతపట్టాలని పిలుపునిచ్చారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 21, 2026, 13:27 IST | Updated: Nov 21, 2026, 13:32 IST
Image Credit: Raja Singh Comments (Source/ZEE News Telugu)
Join

Raja Singh Says Every hindu take up gun for Self Defence:ఆత్మరక్షణ కోసం ప్రతి హిందువు లైసెన్స్‌డ్ తుపాకీ కొనుగోలు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో హిందువులకు  భద్రతాపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.  వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ప్రతి హిందు బంధువుకు  సూచించారు.

సోషల్ మీడియాలో రాజా సింగ్ వీడియో వైరల్.. 

ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం జనాభా పెరిగితే భవిష్యత్తులో భారతదేశంలో హిందువుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో హిందువుల భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

భవిష్యత్తులో ముస్లిమ్స్ నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది..

అందుకే ప్రతి హిందువు ఆత్మరక్షణకు సంబంధించిన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తమ రక్షణ కోసం చట్టబద్ధమైన అనుమతులు తీసుకుని లైసెన్స్‌డ్ తుపాకులను కొనుగోలు చేయాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొంత మంది ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొందరు చట్టసభ సభ్యుడై ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES