SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: నీ పెళ్లాం కడుపుతో ఉంటే మాకేంటీ..?.. హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్.. వీడియోపై రచ్చ..

Rtc driver angry in mgbs: తన భార్య ప్రెగ్నెంట్ అని కొంచెం బస్సును జాగ్రత్తగా నడిపించాలని చెబితే డ్రైవర్ ఆవేశంలో ఊగిపోయాడు. అంతే కాకుండా ప్రయాణికురాలి భర్తపై బూతులతో విరుచుకు పడ్డాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 18, 2026, 16:24 IST | Updated: Nov 18, 2026, 16:35 IST
Image Credit: mgbs rtc bus driver controversy video
Join

Rtc bus driver rude behavior mgbs bus station Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను అందిస్తుంది. మహిళల నుంచి కూడా ఈ పథకంను మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఫ్రీబస్సులో సీటు కోసం మహిళలు గొడవలు పడుతున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు అని కూడా చూడకుండా కొద్ది మంచి ప్రయాణికులు బూతులు తిట్టుకుంటూ దాడులు చేస్తున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ సైతం ఇలాంటి ఘటనలపై సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ బస్సు కండక్టర్, డ్రైవర్ లు సైతం ప్రయాణికులపై  దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో  ఒక డ్రైవర్ ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించాడు.ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.

 

 

 

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్టాండ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు ప్రెగ్నెంట్ తో ఉన్నతన భార్యను బస్సు ఎక్కించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో  కాస్త స్పీడ్ బ్రేకర్ల వద్ద నెమ్మదిగా తీసుకెళ్లాలని చెప్పాడు. దీంతో డ్రైవర్ ఆవేశంలో ఊగిపోయాడు. నీ పెళ్లాం కడుపుతో ఉంటే మాకేంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే వెళ్లి తొలుకో లేదా సపరేట్ గా బస్సు పెట్టుకొ అంటూ బస్టాండ్ లో రెచ్చిపోయాడు. 

పాపం ప్రయాణికురాలి భర్త తాను  కూల్ గా చెప్పిన కూడా బస్సు డ్రైవర్ కావాలని రాద్దాంతం చేస్తున్న కూడా సముదాయించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ డ్రైవర్ మాత్రం వెనక్కు తగ్గలేదు.దీంతొ కొంచెం సేపు ఎంజీబీఎస్ లో గందరగోళం తలెత్తింది. కొంత మంది  ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా  అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ మరీ అంతగా అనుచితంగా ప్రవర్తించాల్సి అవసరం ఏముందని, అతనిపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES