SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Yadagiri Gutta Temple: యాదగిరి గుట్టలో కుప్పకూలిన షెడ్లు.. పదిమందికిపైగా భక్తులకు తీవ్ర గాయాలు.. వీడియో..

Shed collapsed in yadagirigutta: కార్తీక మాసం ఉత్సవాల నేపథ్యంలో యాదాద్రి కొండపై ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా బలమైన గాలులతో కుప్పకూలీపోయాయి. ఈ ఘటనలో పదిమందికి పైగా భక్తులు తీవ్రగాయాలపాలయ్యారు.

Written By Inamdar Paresh
Published: Nov 19, 2026, 17:10 IST | Updated: Nov 19, 2026, 17:17 IST
Image Credit: Yadagiri temple tent collapsed tragedy
Join

Shed collapsed tragedy in yadagirigutta Temple: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపై పెను విషాదం చోటు చేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేకంగా భక్తుల కోసం ఐరన్ షెడ్డూల్ని ఏర్పాటు చేశారు.  ఈ క్రమంలో దశమి నేపథ్యంలో యాదాద్రికి భారీగా భక్తులు తరలివచ్చారు.  భారీగా ఈదురు గాలులు రావడంతో  ఐరన్ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలీపోయింది. దీంతో క్యూలైన్ లో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటనతో కొండపై ఒక్కసారిగా గందరగోళ వాతావరణం తలెత్తింది. 

 

 

పది మంది  భక్తులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్ లను కు సమాచారం అందించారు. గాయపడ్డ  భక్తులకు సపర్యలు చేశారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. 

ఈ ఘటనలో  యాదాద్రి దర్శనాలకు వచ్చిన వారంతా  భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు బాధితుల కుటుంబ సభ్యులు తమ వారికి గాయాలు కావడంతో  కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES