SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Traffic Diversions: హైటెక్‌ సిటీ ప్రాంతంలో హైఅలర్ట్‌.. రేపు హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ మళ్లింపు

Tomorrow Traffic Diversions In Hyderabad: నగర ప్రజలకు భారీ అలర్ట్‌. రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు ఉండనుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌ అయిన హైటెక్‌ సిటీలో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌ విధించారు. ఇంకా ఎక్కడెక్కడ ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారో తెలుసుకోండి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 13, 2026, 10:38 PM IST | Updated: Nov 13, 2026, 10:47 PM IST
Image Credit: Traffic Diversions In Hyderabad
Join

Hyderabad Traffic Diversions: హైదరాబాద్‌ నగర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. యథావిధిగా రోడ్లపై రాకపోకలు సాగిస్తుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రేపు హైదరాబాద్‌లో భారీ ఎత్తున ట్రాఫిక్‌ డైవర్షన్స్‌ విధించారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌ హైటెక్‌ సిటీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టినట్లు ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. ఆ మార్గంలో ప్రయాణాలు ఉంటే విరమించుకోవాలని.. లేదంటే ప్రత్యామ్నాయం చూసుకోవాలని పోలీసులు సూచించారు. రేపటి ట్రాఫిక్‌ డైవర్షన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దాం.

భారత్‌ సమ్మిట్‌ 2026 కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనుండడంతో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టారు. ఆయా మార్గాల్లో భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు ప్రదర్శన జరగనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఐసీసీ, నోవాటెల్ మార్గం పూర్తిగా మూసి వేశారు.

హైటెక్‌ సిటీలోని సైబర్ టవర్స్ నుంచి హైటెక్స్ కమాన్ మీదుగా వెళ్లే మార్గంలో వాహనాలు దారి మళ్లించారు. ఆ మార్గం పూర్తి మూసివేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. ఇక సైబర్ టవర్స్ వైపు నుంచి కొండాపూర్, కొత్తగూడ వెళ్లే వాహనాలు యశోద వసంత సిటీ రోడ్, నోవాటెల్, ఆర్టీఏ జంక్షన్ మీదుగా దారి మళ్లించారు. ఇక బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనదారులు ఐకియా రోటరీ, మీనాక్షి, రోలింగ్ హిల్స్, రాడిసన్ జంక్షన్ నుంచి వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు వెళ్లే వారి కోసం రాడిసన్, ఏఐజీ ఆస్పత్రి, ఐకియా రోటరీ గుండా వాహనాల మళ్లింపు

టెక్ మహీంద్రా వైపు నుంచి హైటెక్ కమాన్ వైపు వచ్చే వాహనాలను సీఐఐ జంక్షన్ వద్ద బొటానికల్ గార్డెన్ వైపు దారి మళ్లించారు.

ప్రజలకు నరకం..
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాగా రేపు కూడా పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేయనుండడతో ఐటీ ఉద్యోగులు అవస్థలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఉద్యోగాలకు వెళ్లే సమయంలోనే వాహనాల దారి మళ్లింపు చేపట్టడంతో ఉద్యోగులు ఈ ట్రాఫిక్‌ డైవర్షన్స్‌ ఉన్నాయనే విషయం తెలుసుకుని ముందే బయల్దేరితే మంచిది. లేదంటే అవస్థలు ఎదుర్కోవాల్సిందే. ముందే అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో రేపు ప్రజలు నరకం అనుభవించే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES