SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

TPCC Meeting: హైదరాబాద్‌కు తొలిసారి బీఎం సందీప్ కుమార్.. మరికాసేపట్లో టీపీసీసీ సమావేశం.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..

Bm Sandeep kumar in hyderabad: ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ హోదాలో తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన బీఎం. సందీప్ కుమార్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్,cwc సభ్యులు వంశీ చంద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

Written By Inamdar Paresh
Published: Nov 22, 2026, 10:58 IST | Updated: Nov 22, 2026, 11:11 IST
Image Credit: cmrevanthreddy(file)
Join

TPCC key Meeting in Gandhi bhavan Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో  కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జీగా నియమితులైన బీఎం సందీప్ కుమార్ తొలిసారి హైదరాబాద్ కు వచ్చారు.    ఆయనకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. మధ్యాహ్నం గాంధీ భవన్ లో టీపీసీసీ సమావేశం జరుగనుంది. ముఖ్యంగా.. కొత్తగా నియమితులైన టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో.. పొలిటికల్ అపైర్స్ కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ, విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.

 దీనిలో కొన్ని ఈ కింది ముఖ్యమైన అంశాలపై చర్చించాలి అజెండాగా పెట్టుకున్నారు. కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇంచార్జ్ బీఎం. సందీప్ కుమార్  ను స్వాగతం పలుకుతూ తీర్మానంతో పాటు, గతంలో విశేష సేవలిందించిన మీనాక్షి  నటరాజన్ కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశ పెట్టారు. 

అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ మూడేళ్ల పాలపై కీలక నేతలతో చర్చించనున్నారు. సర్ ప్రక్రియలోని అవకతవకలు, సంఘటన్ సృజన్ అభియాన్ పై చర్చించనున్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల, టౌన్, డివిజన్, జిల్లా స్థాయి వరకు కమిటీల ఏర్పాటు,దీని ప్రధాన లక్ష్యాలపై చర్చలు జరుపనున్నారు. 

మరోవైపు ఇటీవల జడ్చర్లఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి , మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వివాదం నేపథ్యంలో ఈ సమవేశంపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పీసీసీతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సీఎం రేవంత్ రెడ్డిని, సొంత పార్టీ ప్రభుత్వంను టార్గెట్ చేసి అపోసిషన్ పార్టీత నేతల కన్నా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం వీరి వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుదని తెల్చి చెప్పారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా ఉన్నా  కూడా గీత దాటితే చర్యలు తప్పవని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే స్పష్టం చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES