SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్.. ఫోన్ చూడొద్దన్న తల్లి.. కూతురు ఏంచేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్..

Woman suicide in hyderabad: మొబైల్ ఫోన్ లో రీల్స్ అదే పనిగా చూస్తుండటంతో తల్లికి, కూతురుకు మధ్య తరచుగా వివాదాలు జరిగాయి. ఈ క్రమంలో హయత్ నగర్ లో కూతురు లక్ష్మిదేవికి దారుణంకు పాల్పడింది. ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Nov 21, 2026, 10:37 IST | Updated: Nov 21, 2026, 10:56 IST
Image Credit: woman commits suicide in hyderabad
Join

Woman commits suicide over mobile phone dispute in hyderabad: సమాజంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా చాలా మంది మొబైల్ ఫోన్ ను అడిక్ట్ అయిపోయారని చెప్పుకొవచ్చు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ తమ సర్వస్వం అన్న విధంగా గడుపుతుంటారు.  కొంత మంది అదే పనిగా రీల్స్ చూస్తు రోజంతా టైంపాస్ చేస్తారు. ఇలాంటి క్రమంలో కొన్నిసార్లు అనుకొని ప్రమాదాలు కూడా జరిగిన ఘటనలు కొకొల్లలు. పొరపాటున ఫోన్ లో చార్జింగ్ అయిపోయిన, ఒక్క నిముషం ఫోన్ కన్పించకున్న కూడా చాలా మంది జీవితంలో ఏదో కోల్పోయినట్లు ప్రవర్తిస్తారు.ఈ క్రమంలో  హయత్ నగర్ లో ఫోన్ విషయంలో రాజుకున్న వివాదంతో ఒక మహిళ తన నిండు ప్రాణాల్ని చేజేతులా వద్దనుకుని దారుణంకు పాల్పడింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలంకు చెందిన కిష్ణయ్య, అలివేలు దంపతులకు ఇద్దరు కూతుళ్లు.  అయితే.. చిన్న కూతురికి ఇటీవల నల్గొండ  జిల్లా టీపీ గౌరారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది.ఈ జంట ఉపాధి కోసం హయత్ నగర్లోని బొమ్మలగుడి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. లక్ష్మిదేవికి తన పిల్లలతో పాటు, తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. 

అయితే.. లక్ష్మిదేవి చుట్టుపక్కల వారి ఇళ్లలోకి పనులకు వెళ్తుంటే, భర్త పెయింటింగ్ కు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో లక్ష్మిదేవి తరచుగాతనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని భర్తను అడిగేది.దీంతో భార్య మాట కాదనలేక ఈఎంఐ పద్దతిలో ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు.  అప్పటి నుంచి లక్ష్మిదేవి ఎక్కువగా ఫోన్ లో రీల్స్ చూస్తు గడిపేది. కనీసం పిల్లల్ని పట్టించుకొకుండా రెయింబవళ్లు ఫోన్ లోనే ఉండేది. దీంతో తల్లి తరచుగా కూతురును మందలించేది.  ఈ విషయంలో ఇటీవల పెద్ద గొడవ కూడా చోటు చేసుకుంది. 

దీనితో మనస్తాపం  చెందిన లక్ష్మిదేవి మూడేళ్ల కుమారుడిని అక్కతో కలిసి టీవీ చూడమని చెప్పి గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఇంటికి వచ్చి చూడగా కూతురు విగత జీవిగా మారింది. ఫోన్ కోసం తన నిండు ప్రాణం తీసుకుందని తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES